Boyapati Srinu: బోయపాటి బన్నీని కాదని..ఆ హీరోతో!

సినిమా ఇండస్ట్రీలో ఎవరైనాసరే సక్సెస్ లోనే ఉంటేనే మంచి అవకాశాలు అందుకుంటూ ఉంటారు. లేకపోతే వారితో సినిమాలు చేసేందుకు ఎవరూ కూడా అంతగా ఆసక్తి చూపించరు. ఇక దర్శకుల పరిస్థితి అయితే ఒక్కసారిగా మారిపోతూ ఉంటుంది. ఇక ఇటీవల అఖండ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన బోయపాటికి నిర్మాతల నుంచి ఆఫర్ల సంఖ్య ఎక్కువగానే వస్తోంది. కానీ హీరోలు మాత్రం దొరకడం లేదు. ప్రస్తుతం స్టార్ హీరోలందరూ కూడా పెద్ద సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

మీడియం రేంజ్ హీరోలు కూడా ప్రస్తుతం మరొక సినిమా చేసేంత ఖాళీగా కూడా లేరు. ఇక బోయపాటి శ్రీను అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయాలని అనుకున్న విషయం తెలిసిందే. వీరి కలయికలో అఖండ సినిమాకు సీక్వెల్ వస్తుందని కూడా ఇటీవల కథనాలు వెలువడ్డాయి. కానీ ఆ విషయంలో ఇంకా దర్శకుడు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ప్లాన్ వర్కవుట్ అయితే మాత్రం సీక్వెల్ పాన్ ఇండియా రేంజ్ లో మల్టీ స్టారర్ ప్రాజెక్టుగా తెరపైకి వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ఇక దర్శకుడు బోయపాటి ఇప్పుడు బన్నీ కోసం ఎదురుచూసే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం బన్నీ కాస్త బిజీగా ఉన్నాడు. ఇక ఈ దర్శకుడు మరో హీరో వైపు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. రామ్ పోతినేని తో గత ఏడాది నుంచి బోయపాటి అయితే చర్చలు జరుపుతున్నాడు. వీరి కలయికలో గతంలోనే ఒక సినిమా రావాల్సిందే కానీ ఇద్దరు కూడా ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వలన సరైన ప్లాన్ సెట్ అవలేదు.

ఇక ఇప్పుడు దర్శకుడు బోయపాటి ఖాళీగా ఉండకుండా రామ్ పోతినేని కోసం ఒక పవర్ఫుల్ కథను సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ పోతినేని ది వారియర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా తెలుగు తమిళ్ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది. ఆ సినిమా అనంతరం బోయపాటితో ప్రాజెక్టును మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus