Pushpa2: ఎన్టీఆర్ వర్సెస్ బన్నీ.. 2024 సమ్మర్ లో ఈ రేంజ్ లో పోటీనా?

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప2 మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి రెండు రిలీజ్ డేట్లు ప్రచారంలోకి వస్తుండగా ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీకి సంబంధించిన సినిమా రిలీజవుతున్న సమయంలోనే ఈ సినిమా రిలీజ్ కానుందని వినిపిస్తోంది. 2024 సంవత్సరం మార్చి 29 లేదా ఏప్రిల్ 7 తేదీలలో పుష్ప2 మూవీ రిలీజ్ కానుందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

అయితే ఈ సినిమా ఆ సమయంలోనే రిలీజవుతుందో లేక మరో తేదీకి విడుదలవుతుందో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీ 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 5వ తేదీన విడుదల కానుంది. ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీ బడ్జెట్ విషయంలో నిర్మాతలు రాజీ పడటం లేదు. ఈ సినిమాకు సోలో రిలీజ్ డేట్ దక్కితే బాగుంటుందని అభిమానులు సైతం కోరుకుంటున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, బన్నీ మధ్య మంచి అనుబంధం ఉంది.

ఎన్టీఆర్, బన్నీ (Pushpa2)  బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన సందర్భాలు కూడా చాలా తక్కువనే సంగతి తెలిసిందే. 2024 సమ్మర్ కు బాక్సాఫీస్ వద్ద పోటీ మాత్రం మామూలుగా ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. పుష్ప2 సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. పుష్ప2 సినిమా బడ్జెట్ 500 కోట్ల రూపాయలు కాగా ఈ సినిమా ప్రమోషన్స్ సైతం భారీ రేంజ్ లో ఉన్నాయి.

పబ్లిసిటీ విషయంలో, ఖర్చు విషయంలో మైత్రీ నిర్మాతలు ఏ మాత్రం రాజీ పడటం లేదు. మైత్రీ నిర్మాతలు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాలి. పుష్ప2 బన్నీ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలవడం ఖాయమని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus