Gaami: ‘గామి’ టీజర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చాందినీ చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ‘తమడా మీడియా’ ‘వి సెల్యులాయిడ్’ సమర్పణలో ‘కార్తీక్ కల్ట్ క్రియేషన్స్‌’ బ్యానర్ పై కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే చిన్న గ్లింప్స్ ను, మేకింగ్ వీడియోను విడుదల చేశారు. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

మార్చి 8న శివరాత్రి పండుగ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా టీజర్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. 1 : 29 నిడివి కలిగిన ‘గామి’ టీజర్ ను ప్రధానంగా ఈ సినిమాలో పాత్రలని పరిచయం చేస్తూ కట్ చేశారు అని చెప్పొచ్చు.ఇందులో శంకర్ అనే అఘోరా పాత్రలో హీరో విశ్వక్ సేన్ నెవర్ బిఫోర్ లుక్ లో కనిపిస్తున్నాడు.ఇది అతనికి ఛాలెంజింగ్ రోల్ అని చెప్పవచ్చు.

ఈ టీజర్లో విశ్వనాధ్ రెడ్డి సి హెచ్, రాంపి నందిగం..ల సినిమాటోగ్రఫీలో రూపొందిన విజువల్స్ చాలా బాగున్నాయి. దానికి తగ్గట్టే నరేష్ కుమరన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అత్యద్భుతంగా ఉంది అని చెప్పాలి. ఇక ఈ టీజర్లో విశ్వక్ సేన్, చాందినీ చౌదరి..లతో పాటు ఎం.జి.అభినయ, మహమ్మద్ సమ్మద్, దయానంద్ రెడ్డి, హారిక పెద్దాడ, శాంతి రావ్, బొమ్మ శ్రీధర్, శరత్ కుమార్ ఎన్, వంటి వారు కూడా కనిపించారు. టీజర్ (Gaami) అయితే ఆకట్టుకునే విధంగానే ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!

‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus