Charith Manas: జూనియర్ మహేష్ లా ఉన్న మహేష్ మేనల్లుడు చరిత్ మానస్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇక మహేష్ బాబు స్టైల్ ఆయన ఆటిట్యూడ్, స్వాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా మహేష్ బాబు స్టైల్ ను అనుసరించాలన్న ఇతరులకు ఎంతో కష్టంగా ఉంటుంది మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఉన్నప్పటికీ ఈయన మహేష్ పోలికలు కాకుండా అచ్చం తన తాతయ్య కృష్ణ పోలికలతో ఉంటారు.

ఇక గౌతమ్ ప్రస్తుతం ఉన్నత చదువులు చదువుతూ విదేశాలలో స్థిరపడ్డారు. సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉండడంతో పెద్దగా అభిమానులను కూడా సంపాదించుకోలేకపోయారు. అయితే మహేష్ బాబు కొడుకు మహేష్ బాబులా లేకపోతేనేం మహేష్ బాబుకి జిరాక్స్ కాపీల తన మేనల్లుడు ఉన్నారు. మహేష్ బాబు అక్క ప్రియదర్శిని, నటుడు సుదీర్ బాబు కుమారుడు చరిత్ మానస్ ఇప్పటికే పలు సినిమాలలో బాల నటుడిగా నటించారు.

ప్రస్తుతం మానస్ చాలా పెద్దగా అయిపోయారు. ప్రస్తుతం ఈయనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియో చూసినటువంటి అభిమానులందరూ అచ్చం మహేష్ బాబుకి జిరాక్స్ కాపీ లా ఉన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. మహేష్ లాగే అతని స్మైల్ ఆటిట్యూడ్ అన్ని కూడా చరిత్ మానస్ లో చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రస్తుతం ఈయనకు సంబంధించిన ఈ వీడియో చూస్తే మహేష్ బాబు టీనేజ్ వీడియోనా అనక మానరు.

ఇక సుధీర్ బాబు కూడా తన కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేయడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. చరిత్ కి కనుక సినిమా అవకాశాలు వచ్చి హీరోగా వస్తే మాత్రం అందరూ తనని జూనియర్ మహేష్ బాబు అంటూ పిలిచిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. మరి అచ్చం మహేష్ బాబు పోలికలతో ఉన్నటువంటి తన మేనల్లుడినీ మీరు చూసేయండి. మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus