పైసా వసూల్ విషయంలో ఆనందంలో ఉన్న ఛార్మి
- June 28, 2017 / 01:51 PM ISTByFilmy Focus
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ చేస్తున్న పైసా వసూల్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 29 న రిలీజ్ చేసేందుకు అందరూ కృషి చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాతకు ఎన్నికోట్లు లాభం అందిస్తుందో తెలియదు కానీ ఛార్మికి మాత్రం 4 కోట్ల లాభాన్ని పంచినట్లు తెలిసింది. ఈ సినిమాకి ఛార్మి కి సంబంధం ఏమిటి? అని ఆలోచిస్తున్నారా? సంబంధం ఉంది. ఈ చిత్రానికి పూరి కనక్ట్స్ సంస్థ ద్వారా కాస్టింగ్ బాధ్యతలను ఛార్మి తీసుకుంది. పోర్చుగల్ షెడ్యూల్ కి దేశీ, విదేశీ లేడీ ఆర్టిస్టులను సరఫరా చేసింది. ఆర్టిస్టులకు, డైరక్టర్ కి ఎటువంటి ఇబ్బందులు రాకుండా తానే దగ్గరుండి అన్ని పనులు చూసుకుంది.
దాదాపు నెల రోజుల పాటు జరిగిన పోర్చుగల్ షెడ్యూల్ ఛార్మి మేనేజ్మెంట్ వల్లే చాలా తక్కువ ఖర్చుతో అయిపోయిందని సమాచారం. ఇలా ఆర్టిస్టులకు రెమ్యునరేషన్ నుంచి అందిన కమిషన్, ఇటు చిత్ర నిర్మాతల నుంచి వచ్చిన కమిషన్ తో దాదాపు 4 కోట్ల వరకు వెనకేసినట్లు టాక్. హీరోయిన్ గా ఉన్నప్పుడు రాని లాభాలు, పూరి కనక్ట్స్ కంపెనీ ద్వారా రావడంతో ఛార్మి చాలా సంతోషంగా ఉంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















