తన ఇష్టాలు చెబుతూ.. ఆసక్తికరమైన కామెంట్లు చేసిన ఛార్మీ ..!

ఎన్నో కేజ్రీ సినిమాల్లో నటించి మంచి క్రేజ్ అయితే సంపాదించుకుంది కానీ ఆశించిన స్థాయిలో స్టార్ స్టేటస్ దక్కించుకోలేకపోయింది ఛార్మీ. ప్రభాస్,ఎన్టీఆర్, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, వంటి టాప్ హీరోల సరసన నటించినా ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. ఇక కొన్నాళ్లుగా నటనకు దూరంగా ఉంటూ వస్తుంది ఛార్మీ. అయినప్పటికీ సినిమా ఇండస్ట్రీని మాత్రం విడిచిపెట్టలేదు. నిర్మాతగా మారి పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మిస్తుంది. మే 17న(ఈరోజు) ఛార్మీ పుట్టినరోజు కావడంతో ఈ భామ తను నిర్మిస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో బిజీగా ఉన్నట్లు చెబుతుంది.

ఈ క్రమంలో పూరి జగన్నాథ్ కూడా తనకు ఉన్న బంధం గురించి చెప్పుకొచ్చింది. ఇటీవల ఛార్మీ పాల్గొన్న ఇంటర్వ్యూలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి తన మనసులోని మాటలు చెప్పుకొచ్చింది. ఛార్మీ మాట్లాడుతూ…” ‘ఇస్మార్ట్ శంకర్’ టీజర్ కి ఊహించినదానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందని.. యూనిట్ అంతా చాలా సంతోషంగా ఉన్నాం. నేను పూరికి పెద్ద అభిమానిని.. అభిమానమే కాకుండా ఆయనంటే చాలా ఇష్టం కూడా. పూరి అంటే ఎంతిష్టమంటే.. పూరి .. మహేష్ తో చేసిన ‘పోకిరి’, నేను ప్రభాస్ తో నటించిన ‘పౌర్ణమి’ సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయి. ఆ చిత్రాలు పక్క పక్క థియేటర్లలో ఆడుతుంటే.. ‘పౌర్ణమి’ సినిమా చూడకుండా ‘పోకిరి’ సినిమా చూశా.. ఎందుకంటే పూరి అంటే నాకు అంతిష్టం” అంటూ చెప్పుకొచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus