Charmme Kaur: యాక్టివ్‌గా ఉండే ఛార్మి ఎందుకు గమ్మునుంటోంది!

హీరోయిన్‌గా ఉన్నప్పటి నుండే సోషల్‌ మీడియాలో ఛార్మి చాలా హుషారుగా ఉంటూ వచ్చింది. కాస్త సినిమాలు తగ్గగానే జోరు పెంచేసింది. ఇప్పుడు నిర్మాతగా మారాక సోషల్‌ మీడియాను తన సినిమాలకు, సినిమాల్లోని నటుల ప్రచారానికి బాగానే వాడుకుంటోంది. అందులో తప్పు కూడా లేదు. సోషల్‌ మీడియా ఉన్నదే ప్రచారానికాయె. అయితే అలాంటి ఛార్మి ఇప్పుడు సోషల్‌ మీడియాకు బ్రేక్‌ తీసుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో ఎందుకా అనే చర్చ మొదలైంది. రెండు రోజులు (ఆగస్టు 3)క్రితం ఛార్మి ట్విటర్‌లో ఈ మేరకు బ్రేక్‌ తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

అయితే ఇప్పటికిప్పుడు ఆమె సోషల్‌ మీడియాకు దూరం అవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందనే చర్చలు నడుస్తున్నాయి. కావాలంటే పోస్టులు పెట్టొచ్చు, లేదంటే గమ్మునుండొచ్చు… అంతేకానీ ఇలా సోషల్ మీడియా కొన్ని రోజులు దూరం అని వెళ్లడం ఎందుకో. పోనీ ఏదైనా ట్రిప్‌కి వెళ్తున్నారా… అక్కడ మొబైల్‌ ఉండదా… ఇప్పుడు భూమి మీద జనాలు తిరిగే ప్లేస్‌లో మొబైల్‌ నెట్‌వర్క్‌ లేని ప్రాంతం లేదనే చెప్పొచ్చు. అయితే ఇటీవల కాలంలో ఛార్మి సోషల్‌ మీడియా అకౌంట్స్‌కి ‘లైగర్‌’ అప్‌డేట్ల కోసం రిక్వెస్ట్‌,

స్వీట్‌ థ్రెట్లు ఎక్కువవుతన్నాయి. దీంతో ఆ చిరాకును తట్టుకోలేకే ఛార్మి సోషల్‌ మీడియాకు దూరంగా వెళ్లిందా అనే అనుమానమూ కలుగుతోంది. ‘లైగర్‌’ ప్రారంభమైంది మొదలు ఛార్మి ఏదో పోస్టు పెడుతూనే ఉంది. అయితే ఏమైందో కానీ ఇటీవల ఆ సినిమా యూనిట్‌ అంత యాక్టివ్‌గా లేదు.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus