2022 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఏదనే ప్రశ్నకు ఏ మాత్రం తడబడకుండా తెలుగు సినీ అభిమానులు ఆర్ఆర్ఆర్ అని చెబుతారు. మల్టీస్టారర్ గా ఈ సినిమా తెరకెక్కగా రాజమౌళి దర్శకత్వం వహించడం ఈ సినిమాకు ప్లస్ అయింది. అయితే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తే నటీనటులుగా ఎవరెవరు బాగుంటారు? ఎవరు దర్శకత్వం చేస్తే బాగుంటుంది? అనే ప్రశ్నలకు చాట్ జీపీటీ ఆసక్తికర సమాధానాలు ఇవ్వగా ఆ సమాధానాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అల్లూరి సీతారామరాజు పాత్రలో రణ్ వీర్ సింగ్ కానీ సిద్దార్థ్ మల్హోత్రా కానీ బాగుంటారని చాట్ జీపీటీ పేర్కొంది. రణ్ బీర్ సింగ్ అభినయం అద్భుతంగా ఉంటుందని రణ్ వీర్ ఎంపిక చేసుకున్న పాత్రలో లీనమైపోతాడని గతంలో రణ్ వీర్ పోషించిన పవర్ ఫుల్ రోల్స్ ఇందుకు నిదర్శనం అని రణ్ వీర్ నటన గురించి చాట్ జీపీటీ ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. భీమ్ పాత్రకు విక్కీ కౌశల్, రాజ్ కుమార్ రావు కరెక్ట్ అని చాట్ జీపీటీ చెప్పుకొచ్చింది.
వీళ్లిద్దరిలో భీమ్ పాత్రను ఎవరు పోషించినా ఆ పాత్రకు న్యాయం చేయగలరని చాట్ జీపీటీ పేర్కొంది. సీత పాత్రకు శ్రద్ధా కపూర్ లేదా కృతిసనన్ బాగుంటారని చాట్ జీపీటీ తెలిపింది. శ్రియ స్థానంలో దీపికా పదుకొణే బాగుంటారని చాట్ జీపీటీ వెల్లడించింది. అజయ్ దేవగణ్ రోల్ కు అనిల్ కపూర్ లేదా సంజయ్ దత్ బాగుంటారని చాట్ జీపిటీ పేర్కొంది. సంజయ్ లీలా భన్సాలీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తే బాగుంటుందని చాట్ జీపీటీ వెల్లడించింది.
చాట్ జీపీటీ వెల్లడించిన విషయాల గురించి చరణ్, తారక్, రాజమౌళి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. సంజయ్ లీలా భన్సాలీ బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించి ఆ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్నారు. రాబోయే రోజుల్లో (RRR) ఆర్ఆర్ఆర్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుందని వార్తలు వస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే.
విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?