ఈమధ్యకాలంలో సినిమా విడుదలై కనీసం మ్యాట్నీ షో కూడా పడక ముందే సక్సెస్ మీట్ అని, సక్సెస్ సెలబ్రేషన్స్ అని హడావుడి చేసేస్తున్నారు చిత్రబృందం. కానీ.. నిన్న విడుదలైన “చౌర్య పాఠం” (Chaurya Paatam) బృందం సక్సెస్ మీట్ కు భిన్నంగా “గ్రాటిట్యూడ్ మీట్”ను ఏర్పాటు చేసి.. చిత్రబృంద సభ్యులు మాట్లాడుతూ.. “మా సినిమాకి భీభత్సమైన ఓపెనింగ్స్ ఏమీ రాలేదు, హౌస్ ఫుల్స్ కూడా అవ్వలేదు కానీ.. చూసినవాళ్ళందరూ బాగుంది అన్నారు. దయచేసి రివ్యూలు మాత్రం సినిమా చూసి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం” అని పేర్కొనడం అనేది మెచ్చుకోవాల్సిన విషయం.
థియేటర్లకు జనాలు రావడం కష్టమవుతున్న ఈ తరుణంలో అనవసరమైన సక్సెస్ మీట్ లు పెట్టుకోకుండా.. సినిమాని ప్రమోట్ చేస్తూ “మా సినిమా చూడండి” అని ప్రమోట్ చేస్తూ సినిమాని ఇంకాస్త ఎక్కువమందికి రీచ్ అయ్యేలా చేయడం అనేది చాలా ఇంపార్ట్మెంట్. ఈ విషయంలో “చౌర్య పాఠం” టీమ్ చేస్తున్నది సరిగ్గా ఉంది. మరీ ముఖ్యంగా హీరో మాట్లాడుతూ.. “కుదిరితే సక్సెస్ మీట్ లో కలుద్దాం, లేదంటే ఇంకో సినిమా మీట్ లో కలుద్దాం” అంటూ ప్రాక్టికల్ గా మాట్లాడిన విధానం ఆకట్టుకుంది.
అనుకున్నదానికంటే కాస్త ఎక్కువ బడ్జెట్ పెట్టిన ఈ చిత్రం విడుదల విషయంలో చాలా ఇబ్బందులుపడింది. అందులోనూ ఈ సినిమాని కేవలం 150 థియేటర్లలో విడుదల చేసారు. స్ట్రాటజీ పరంగా ఇది మంచిదే. బుకింగ్స్ ను బేస్ చేసుకుని థియేటర్స్ పెంచుకుంటూ, నీట్ గా ప్రమోట్ చేసుకుంటూ వెళ్తే.. “చౌర్య పాఠం” కచ్చితంగా సేఫ్ జోన్ లోకి వస్తుంది.
ఇక చివర్లో నిర్మాత నక్కిన త్రినాథరావు (Trinadha Rao) మాట్లాడుతూ.. “అసలు మా సినిమాకి రివ్యూలు రాయరు అనుకున్నాం. అలాంటిది రివ్యూలు రాయడం కూడా గ్రేట్. మనం రివ్యూల గురించి తప్పుగా మాట్లాడకూడదు” అని చేసిన కామెంట్ గ్రాటిట్యూడ్ మీట్ లో కొందరు చేసిన వ్యాఖ్యలను కవర్ చేసింది.
మా సినిమాకి అసలు రివ్యూలు రాయరు అనుకున్నాం, అలాంటిది రాసినందుకు సంతోషపడుతున్నాం#ChauryaPaatam #TrinadhaRaoNakkina pic.twitter.com/7qReRdaXrO
— Filmy Focus (@FilmyFocus) April 26, 2025