యంగ్ హీరో నితిన్ నటించిన ‘చెక్’ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి డివైడ్ టాక్ వస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న చంద్రశేఖర్ యేలేటి ఈ సినిమాని డైరెక్ట్ చేయడంతో కచ్చితంగా సినిమా సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని అంతా అనుకున్నారు. కానీ సినిమా చూసిన ప్రేక్షకులు విస్మయపోయారు. ముఖ్యంగా క్లైమాక్స్ చూసి పెదవి విరుస్తున్నారందరూ.
కథను ఎటూ కాకుండా అలా వదిలేయడం ఏంటంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. హీరో నిర్దోషిగా నిరూపించుకోవాలని, క్షమాభిక్షతో బయటకి రావాలనేది ఇందులో మెయిన్ పాయింట్. కానీ ఈ రెండూ సినిమాలో జరగవు. క్లైమాక్స్ లో హీరో జైలు నుండి తప్పించుకొని పారిపోవడంతో ఎండ్ కార్డు వేసేశారు. నిజానికి ఈ సినిమా సీక్వెల్ ఆలోచించాడట దర్శకుడు. ఆ సీక్వెల్ లో హీరో నిర్దోషిగా నిరూపించుకుంటాడట. ముందు రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం అయితే.. హీరో నిర్దోషిగా బయటకి రావడంతో కథ ముగుస్తుందట.
అయితే సినిమా మేకింగ్ ప్రాసెస్ లో డైరెక్టర్ కి సీక్వెల్ ఆలోచన రావడం, దానికి హీరో ఓకే చెప్పడంతో.. క్లైమాక్స్ ని మార్చినట్లు తెలుస్తోంది. సీక్వెల్ ఆలోచన లేకపోతే ఈ సినిమా క్లైమాక్స్ మరోలా ఉండేదని చెబుతున్నారు. క్లైమాక్స్ మారితే.. రిజల్ట్ మారుతుందని కాకపోయినా.. కథ కాస్త బెటర్ గా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. సీక్వెల్ కోసం చూసుకొని అసలు కథను పక్కన పెట్టేసి ‘చెక్’ టీమ్ తప్పు చేసిందనే మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాకి వస్తోన్న రిజల్ట్ బట్టి సీక్వెల్ చేసే ఛాన్స్ లేదని టాక్.