అక్కినేని అఖిల్ (Akhil Akkineni) పెళ్లి చేసుకోబోతున్నాడు. బైనవ్ రవ్ డ్జీ (Zainab Ravdjee) అనే అమ్మాయితో చాలా సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అఖిల్. ఈ వార్త బయటకి వచ్చినప్పటి నుండి అందరిలో ఒక్కటే ప్రశ్న మెదులుతుంది. అదే.. ఎవరికీ బైనవ్ రవ్ డ్జీ? దీనిపై సోషల్ మీడియాలో ఎక్కువగానే చర్చలు జరుగుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. బైనవ్ రవ్ డ్జీ ముంబైకి చెందిన అమ్మాయి. వాళ్ల ఫ్యామిలీ కూడా ముంబైకి చెందినదే. ఆమె (Zainab Ravdjee) గ్రేట్ ఆర్టిస్ట్(పెయింటర్) అని తెలుస్తుంది.
Zainab Ravdjee
చిత్రలేఖనంలో అమితంగా ప్రావీణ్యం పొందిన ఓ మంచి ఆర్టిస్ట్ అని అంటున్నారు. ఇంటర్నేషనల్ వైడ్ ఆమె ఎగ్జిబీషన్లు కండక్ట్ చేసి ప్రశంసలు పొందింది అని సమాచారం. ఓ ఎగ్జిబిషన్‌లో భాగంగా అఖిల్ ను ఆమె మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా కలుసుకుందట. ఆ తర్వాత ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నట్టు సమాచారం. ఇక బైనవ్ రవ్ డ్జీ తండ్రి జుల్ఫీ రవ్ డ్జీ ఒక పెద్ద బిజినెస్మెన్ అని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి ఇతను బెస్ట్ ఫ్రెండ్ అలాగే సలహాదారుడు అని తెలుస్తుంది.
విదేశాల్లో కూడా ఇతనికి బిజినెస్లు ఉన్నట్టు సమాచారం. ఇక అఖిల్ గతంలో శ్రియ భూపాల్ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. చాలా గ్రాండ్ గా వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే ఎందుకో వీరి పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. తర్వాత ఆమె ఆనందిత్ రెడ్డి అనే అబ్బాయిని వివాహం చేసుకుంది. శ్రియ భూపాల్.. రాంచరణ్ (Ram Charan) సతీమణి ఉపాసనకి కజిన్ అనే సంగతి కూడా అందరికీ తెలిసిందే.ఇక ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యాక సినిమాలతో అఖిల్ బిజీ అయ్యాడు.