ఇటీవల బాలీవుడ్‌లో విడుదలైన ‘చావా'(Chhaava) సినిమా, శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన హిస్టారికల్ డ్రామా, హిందూ సంఘాల నుంచి విపరీతమైన ఆదరణ పొందింది. ఆ సినిమా హిందుత్వ భావజాలాన్ని బలంగా ప్రదర్శించడం, శంభాజీ మహారాజ్ దేశభక్తిని హైలైట్ చేయడం వల్ల నార్త్ బెల్ట్‌లో హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధించి 400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ విజయంతో హిందూ గ్రూపులు, సోషల్ మీడియా హ్యాండిల్స్ సినిమా ప్రచారంలో భాగమయ్యాయి.
ఇప్పుడు అదే వాతావరణం టాలీవుడ్‌లో పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) కోసం కూడా ఏర్పడుతుందా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ‘హరి హర వీరమల్లు’ సినిమా క్రిష్ దర్శకత్వంలో మొదలవగా జ్యోతిక్రిష్ణ డైరెక్షన్ లో ఫినిష్ అవుతోంది. ఈ చిత్రం కూడా ఔరంగజేబు కాలం నాటి కథ ఆధారంగా రూపొందుతుంది. సినిమాలో పవన్ కల్యాణ్ పోషించే వీరమల్లు పాత్ర, ఔరంగజేబు పాలనలో హిందువులపై జరిగిన దోపిడీకి ప్రతినిధిగా నిలుస్తుందని సమాచారం.
పవన్ ఇటీవల కాలంలో సనాతన ధర్మానికి మద్దతుగా చేస్తున్న ప్రచారం, ఆయన తలపై తిరుగులేని బొట్టు, మాలధారణ ఇవన్నీ కూడా హైలెట్ అవుతున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయంగా కూడా బీజేపీకి దగ్గరగా ఉన్న కారణంగా, హిందూత్వ భావజాలాన్ని మద్దతు ఇచ్చే గ్రూపులు ఈ సినిమాను సమర్థంగా ప్రచారం చేసే అవకాశముంది. ‘చావా’ సినిమాకు మాదిరిగా, ఈ సినిమాలో కూడా ఒక వీరుడి పోరాటం హైలైట్ అవుతుందన్న టాక్ ఉండటంతో, హిందూ సంఘాలు ఈ సినిమాను ప్రాముఖ్యతతో పరిగణించే అవకాశం ఉంది.
నార్త్ బెల్ట్‌లో ఉన్న హిందీ ఆడియన్స్ ఈ సినిమాను స్వీకరించేలా ఒక ప్రత్యేక ప్రొమోషన్ ప్లాన్ రూపొందించే ఆలోచన ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ‘హరి హర వీరమల్లు’ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్స్‌లో పవన్ లుక్ చూసినవారెవ్వరైనా ఆ పాత్రలో ఆయన హుందా శౌర్యం, హిందుత్వ ఆభిమానం స్పష్టంగా కనిపిస్తుందని అంటున్నారు.
ఇక చావా తరహాలో హిట్టు సాధించాలంటే కేవలం కంటెంట్ మాత్రమే కాకుండా, సమర్థవంతమైన ప్రమోషన్ కూడా అవసరం. ఆ కోణంలో పవన్ సినిమాకు హిందూ సంఘాలు మద్దతు ఇస్తే, ఆ సినిమాను దేశవ్యాప్తంగా పెద్ద విజయంగా మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద, ‘చావా’ సినిమా స్టైల్ లో ‘హరి హర వీరమల్లు’ కూడా హిందూత్వ కలర్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందా? అనే చర్చ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.