‘హనుమాన్’ సినిమా జనవరి 12న రిలీజ్ కాబోతుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన.. కాదు కాదు వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్న సినిమా అంటే దీని గురించే చెప్పుకోవాలి. ఎందుకంటే.. ‘హనుమాన్’ రిలీజ్ అవుతున్న జనవరి 12 నే ‘గుంటూరు కారం’ సినిమా కూడా రిలీజ్ అవుతున్నట్టు ముందుగానే అధికారిక ప్రకటన వచ్చింది. కానీ ‘మేము ఇంకా ముందు ప్రకటించాం’ అంటూ ‘హనుమాన్’ యూనిట్.. మొండికేసి కూర్చుంది. దీని వల్ల ‘హనుమాన్’ కి ఎక్కువ థియేటర్స్ దొరకడం లేదు.
ఆంధ్రాలో (Hanu Man) ‘హనుమాన్’ కి ఎక్కువ థియేటర్సే దొరికాయి. నార్త్ లో కూడా స్క్రీన్స్ మంచిగానే దొరికే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు ‘హనుమాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ వేడుకకు ప్రభాస్ ను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పారు. ఒకవేళ నిజంగానే ప్రభాస్ కనుక ‘హనుమాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తే.. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లో కూడా ‘హనుమాన్’ కి మంచి ప్రమోషన్ జరిగుండేది.
కానీ ఇప్పుడు ప్రభాస్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో చిత్ర బృందం మెగాస్టార్ చిరంజీవితో సంప్రదింపులు జరిపింది. చిరు కూడా అందుకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ‘హనుమాన్’ ప్రీ రిలీజ్ కి గెస్ట్ గా చిరు వచ్చే ఛాన్స్ ఉంది. చిరుకి ఇష్టదైవం హనుమంతుడు కాబట్టి.. ‘హనుమాన్’ మూవీ యూనిట్ చిరుని అప్రోచ్ అయ్యి కన్విన్స్ చేసినట్టు స్పష్టమవుతుంది.