ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక షూటింగ్ ముగియడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ తో డోస్ పెంచాలని అనుకుంటోంది. కేవలం రెండు పాటలు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మినహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్ పాటలతోనే ఎక్కువగా హైప్ క్రియేట్ చేయాలని అనుకుంటోంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇదివరకే టీజర్స్ తో అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి అంచనాల స్థాయిని పెంచారు.
సినిమాలో సరికొత్త తరహాలో మ్యూజిక్ ను అందించబోతున్నట్లు హింట్ అయితే ఇచ్చేశారు. ప్రతి సాంగ్ కూడా సినిమాలో ఒక కీలక అంశాన్ని ఎలివేట్ చేసేలా ఉంటుందట. ఇక పాన్ ఇండియా సినిమాకు ఎలాగైతే అవసరమే అలానే పాటలు అంధించగలరు కీరవాణి.ఈ సినిమాలో ఒక కొత్త చిన్నారికి కూడా పాడే అవకాశం లభించింది. కీరవాణి తన ట్విట్టర్ లో ప్రకృతి అనే చైల్డ్ సింగర్ ఫొటోను పోస్ట్ చేస్తూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఆర్ఆర్ఆర్ పాటకు ఆమె గానం చాలా హెల్ప్ అయినట్లు ట్వీట్ చేశారు. చూస్తుంటే సినిమాలోని పాటలతో ఎదో మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నట్లు అర్థమవుతోంది. ఇక మొదట ఒక ప్రమోషనల్ సాంగ్ ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Happy birthday Prakruthi ❤️ Your cute voice added extra life to my song from RRR. May God bless you with a wonderful life ! pic.twitter.com/Knnmh2SFhc
— mmkeeravaani (@mmkeeravaani) July 20, 2021
Most Recommended Video
పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్