సినిమా హీరోయిన్ల కంటే బుల్లితెరపై సందడి చేసే యాంకర్లకు భీభత్సమైన క్రేజ్ ఉంటుంది. ఇలా చెప్పడంలో అతిశయోక్తి అనిపించుకోదు. హీరోయిన్లు గట్టిగా సినిమాలు చేస్తే నెలకు ఒక శుక్రవారం నాడు కనిపిస్తారు. కానీ బుల్లితెర యాంకర్లు ప్రతి వారం సందడి చేస్తూనే ఉంటారు. అందుకే వాళ్ళకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే షోలు చేసుకుంటారు.. మరోవైపు ప్రమోషనల్ ఈవెంట్లు కూడా చేసే అవకాశాలు వస్తాయి.
అదీ కాదు అంటే.. కమర్షియల్స్ కోసం కూడా వీరిని సంప్రదిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో కూడా వీరి హవా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా గ్లామర్ ఫొటోలతో సోషల్ మీడియాలో వీరు చేసే రచ్చ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ లిస్టులో ముందు వరుసలో ఉంటుంది విష్ణు ప్రియా (Vishnu Priya).
పలు షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ప్రారంభించిన విష్ణుప్రియ.. (Vishnu Priya) ‘ట్వంటీ ఫస్ట్ సెంచరీ లవ్’ ‘చెక్ మేట్’ వంటి సినిమాల్లో కూడా నటించింది. అయితే అవి ఈమెకు కలిసిరాలేదు. తర్వాత సుడిగాలి సుధీర్ తో కలిసి ‘పోవే పోరా’ షోని హోస్ట్ చేసింది. ఈ షో ద్వారా విష్ణుప్రియకి మంచి పాపులారిటీ లభించింది.
ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే బుల్లితెరపై షోలలో కూడా సందడి చేస్తుంది ఈ బ్యూటీ. గతేడాది ‘బిగ్ బాస్ 8’ లో కూడా ఈ బ్యూటీ సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈమె చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో ఈమె చాలా క్యూట్ గా కనిపిస్తుంది.