Adipurush: అఫీషియల్.. ఆది పురుష్ ప్రీ రిలీజ్ గెస్ట్ గా చిన్న జీయర్ స్వామి!

ప్రభాస్ కృతి సనన్ జంటగా రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకేక్కిన చిత్రం ఆది పురుష్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ జూన్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా కృతి సనన్ సీతమ్మ పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.

ఈ క్రమంలోనే (Adipurush) ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను చాలా ఘనంగా నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఏ వేడుక జరగని విధంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని మేకర్స్ భావించినట్టు సమాచారం. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను తిరుపతిలో ఎంతో ఘనంగా జూన్ 6వ తేదీ నిర్వహించబోతున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి కావచ్చయాని సమాచారం. ఇక ఈ వేడుకకు లక్ష మంది అభిమానులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారని తెలుస్తుంది.

ఈ వేడుక కోసం సుమారు రెండు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ వేడుకలో భాగంగా 200 మంది సింగర్ ల చేత పెర్ఫార్మెన్స్ చేయించబోతున్నారట.ఇక ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి జైశ్రీరామ్ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఈ పాటను లైవ్ లో పాటించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు ఏ సినిమా వేడుక జరగని విధంగా ఈ వేడుక చేయాలని డైరెక్టర్ ఓం రౌత్ భావించారట.

ఈ విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎవరు రాబోతున్నారన్న విషయం గురించి కూడా చర్చలు మొదలయ్యాయి. అయితే తాజాగా మేకర్స్ ఈ సినిమా వేడుకకు చిన్న జీయర్ స్వామి ముఖ్యఅతిథిగా రాబోతున్నారు అంటూ అధికారికంగా తెలియజేశారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన పోస్టర్ ను మేకర్ అధికారిక ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.ఇక ఈ వేడుక జూన్ 6వ తేదీ సాయంత్రం 6 గంటలకు తిరుపతిలో జరగబోతోంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus