“చినుకు చినుకుతో మణిహారం అల్లుకున్నదే” అంటున్న “నరసింహపురం” చిత్ర బృందం!!

గీత్ గౌరవ్ సినిమాస్ పతాకంపై.. పి.ఆర్.క్రియేషన్స్ సమర్పణలో టి.ఫణిరాజ్ గౌడ్- నందకిశోర్ ధూళిపాలతో కలిసి శ్రీరాజ్ బళ్లా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నరసింహపురం’. పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నందకిశోర్ ఈ చిత్రం ద్వారా హీరోగా మారుతున్నారు. సిరి హనుమంతు హీరోయిన్ గా నటిస్తుండగా.. వర్ధమాన నటి ఉష హీరో చెల్లెలు పాత్రలో నటించారు. వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ… అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో అత్యద్భుతంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్స్, ఒక లిరికల్ వీడియోతో అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షించిన ఈ చిత్రం నుంచి చిత్ర బృందం సమక్షంలో తాజాగా మరో సాంగ్ రిలీజ్ అయ్యింది. “చినుకు చినుకుతో మణిహారం అల్లుకున్నదే” అనే పల్లవితో సాగే ఈ పాటను శ్రీరాజ్ బళ్లా స్వయంగా ఆలపించడం విశేషం. గడ్డం వీరు ఈ చిత్రంలోని పాటలన్నీ రాయగా.. ఫ్రాంక్లిన్ సుకుమార్ సంగీతం అందించారు.

ఈ కార్యక్రమంలో హీరో నందకిషోర్, దర్శకులు శ్రీరాజ్ బళ్ళా, నిర్మాతల్లో ఒకరైన ఫణిరాజ్ గౌడ్, సంగీత దర్శకులు ఫ్రాంక్లిన్ సుకుమార్, ఎడిటర్ శివ.వై.ప్రసాద్, వి-ఎఫెక్ట్స్ చందు ఆది పాల్గొన్నారు. చిత్ర దర్శకుడు శ్రీరాజ్ బళ్ళా మాట్లాడుతూ…”హీరోగా పరిచయమవుతున్న ప్రముఖ నటుడు నందకిషోర్ నటన, ఫ్రాంక్లిన్ సుకుమార్ సంగీతం, శివ ఎడిటింగ్, చందు ఆది విజువల్ ఎఫెక్ట్స్ ‘నరసింహపురం’ చిత్రానికి ముఖ్య ఆకర్షణలుగా నిలుస్తాయి” అన్నారు. కల్యాణ మాధవి, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫేమ్ విజయ్ కుమార్, అరవిందసమేత ఫేమ్ రంగధామ్, రవివర్మ, సంపత్, ఫణిరాజ్, స్వామి, శ్రీకాంత్, శ్రీకర్, శివ, జునైద్, గిరిధర్, సాయిరాజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ, మేకప్: కె.వి.బాబు, పబ్లిసిటీ డిజైన్స్: వెంకట్.ఎం, విఎఫెక్స్: చందు ఆది, కెమెరా: కర్ణ ప్యారసాని, ఎడిటర్: శివ వై.ప్రసాద్, పాటలు: గడ్డం వీరు, సంగీతం: ఫ్రాంక్లిన్ సుకుమార్, నిర్మాతలు: శ్రీరాజ్ బళ్ళా- టి.ఫణిరాజ్ గౌడ్-నందకిశోర్ ధూళిపాల, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీరాజ్ బళ్ళా!!


మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus