చిరు, ఆమిర్ లతో రాజమౌళి మాస్టర్ ప్లాన్!

టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్.. కొమరం భీమ్ గా కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాపై హైప్ పెంచడానికి రాజమౌళి భారీ స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకి స్టార్లతో వాయిస్ ఓవర్ చెప్పించాలని చూస్తున్నాడు.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో ఆయా భాషలకు సంబంధించిన సూపర్ స్టార్లతో ఈ సినిమా నేపథ్యాన్ని వాయిస్ ఓవర్ ద్వారా చెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఫిలిం సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవిని, హిందీలో ఆమిర్ ఖాన్ ను దీనికోసం సంప్రదించినట్లు చెబుతున్నారు. రాజమౌళి ఫోన్ చేసిన అడిగిన వెంటనే చిరంజీవి మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పేశారట.

చిరుకి, రాజమౌళి మంచి సాన్నిహిత్యం ఉండడంతో పాటు చరణ్ ఈ ప్రాజెక్ట్ లో భాగం కావడంతో చిరు అంగీకరించినట్లు తెలుస్తోంది. మరోపక్క ఆమిర్ కి, రాజమౌళికి మధ్య మంచి స్నేహం ఉంది. రాజమౌళితో పని చేయాలనుందని గతంలో ఆమిర్ అన్నారు. ఆ సాన్నిహిత్యంతోనే రాజమౌళి అడిగిన వెంటనే ఆమిర్ ఓకే చెప్పినట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే!

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus