తన రీమేక్‌లకు వీళ్లే కరెక్ట్‌ అంటున్న చిరు!

‘నా ఆత్మకథలో ఫలానా హీరో/హీరోయిన్‌’ నటించాలి అంటూ హీరో/హీరోయిన్లు చెప్పడం మనం చాలాసార్లు చూశాం. అయితే తను నటించిన సినిమాల్లో ఎవరు నటిస్తే బాగుంటుంది అని చెప్పడం చాలా అరుదు. అలా చెప్పాలంటే ఎక్కువ సినిమాలు చేసుండాలి, అవి ఇప్పటికీ రిలేటెడ్‌గా ఉండి ఉండాలి. అలాంటి సినిమాలు చేసిన, ఇప్పుడు కొత్త తరం హీరోలకు సూచించిన నటుడు మెగాస్టార్‌ చిరంజీవి. ‘ఆహా’లో ప్రసారమవుతున్న సమంత టాక్‌ షో ‘సామ్‌ జామ్‌’లో చిరంజీవి తన సినిమాల రీమేక్‌ హీరోల పేర్లు చెప్పాడు.

‘ఠాగూర్‌’, ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’, ‘ఛాలెంజ్‌’, ‘రౌడీ అల్లుడు’, ‘గ్యాంగ్‌ లీడర్‌’, ‘ఇంద్ర’ ఇలా తన సూపర్‌ హిట్‌ సినిమాలకు ఇప్పటితరం హీరోల్లో ఎవరు సూట్‌ అవుతారో చిరంజీవి చెప్పాడు. ‘ఠాగూర్‌’ని రీమేక్‌ చేయాల్సి వస్తే అందులో హీరోగా కచ్చితంగా తన తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ అయితే సరిపోతాడని చిరంజీవి అన్నాడు. ‘ఇంద్ర’కి ప్రభాస్‌, ‘ఛాలెంజ్‌’కి అల్లు అర్జున్‌, విజయ్‌ దేవరకొండ పేర్లు సూచించాడు. ఇక ‘రౌడీ అల్లుడు’కి బన్నీ, రవితేజ బాగుంటారు అని చెప్పగా, ‘గ్యాంగ్‌ లీడర్‌’కి చరణ్‌, తారక్‌ సూట్‌ అవుతారని చెప్పాడు. ‘జగదేకవీరుడు..’కి మహేశ్‌బాబు, చెర్రీ, తారక్‌ అంటూ మూడు పేర్లు చెప్పాడు. ‘విజేత’ చిత్రానికి నాగచైతన్య చక్కగా నప్పుతాడని అన్నాడు చిరు.

అయితే తన ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ ‘స్వయంకృషి’ని రీమేక్‌కు వేరే హీరో పేరు సజెస్ట్‌ చేయలేదు. ఆ సినిమాకు తాను మాత్రమే సెట్‌ అవుతానని చిరంజీవి చెప్పాడు. మామూలుగా రీమేక్‌లు చేయమంటే మనవాళ్లు చేసేస్తారు కానీ…. ఇలా తెలుగులోనే, అందులోనూ రికార్డులు బద్దలు కొట్టిన సినిమాలు మళ్లీ చేయాలంటే కొంచెం జంకుతారేమో అనిపిస్తోంది. చరణ్‌ ‘గ్యాంగ్‌ లీడర్‌’ చేస్తే చూడాలని చాలామంది అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. మరోవైపు అవినీతి మీద పవన్ ఓ సినిమా చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండూ ఓకే అవుతాయేమో చూడాలి.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus