Chiranjeevi: సినిమా ప్లాపయ్యిందనే బాధ లేదు.. ఆయన చెప్పిందే చేశాం: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి నుండి ఈ ఏడాది వచ్చిన ‘ఆచార్య’ చిత్రం పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఏప్రిల్ 29న రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ ను మూటకట్టుకుంది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాకైనా ప్లాప్ టాక్ వస్తే.. కనీసం వీకెండ్ వరకు అయినా కలెక్షన్స్ వస్తాయి. కానీ ‘ఆచార్య’ విషయంలో అలా జరగలేదు. రెండో రోజు నుండే జనాలు ఈ సినిమాని పక్కన పెట్టేశారు. థియేటర్లు ఖాళీ అయిపోయాయి.

రాంచరణ్ వంటి పాన్ ఇండియా స్టార్ ఈ మూవీలో నటించినా కూడా.. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల షేర్ ను కూడా రాబట్టలేకపోయింది. ఇక ఈ చిత్రం తెచ్చిన నష్టాలను పూడ్చడానికి దర్శకుడు కొరటాల శివ ఎన్ని తిప్పలు పడుతున్నాడో అందరికీ తెలిసిన విషయమే. ‘ఆచార్య’ వ్యాపార లావాదేవీల్లో ఆయన ఇన్వాల్వ్ అవ్వడంతో చాలా నష్టపోయాడు అందుకోసం తన స్థలాన్ని కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. సరే ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టేస్తే..’గాడ్ ఫాదర్’ ప్రమోషన్లలో భాగంగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవికి ‘ఆచార్య’ రిజల్ట్ గురించి ప్రశ్న ఎదురైంది.

దాని పై చిరు స్పందిస్తూ.. “ఓ సినిమా ఫలితం ఎప్పుడూ మన చేతిలో ఉండదు. మన పని మనం చేశామా లేదా . మన బెస్ట్ మనం ఇచ్చామా లేదా అన్నదే మన చేతిలో ఉంటుంది. ‘ఆచార్య’ ఫలితం నన్ను బాధ పెట్టలేదు. దర్శకుడు చెప్పిందే చేసాం. కాకపోతే చరణ్ నేను కలిసి చేసిన సినిమా ప్లాప్ అయ్యింది. భవిష్యత్తులో మళ్ళీ మేము కలిసి చేస్తే ఆ సినిమాకి ఆశించిన స్థాయిలో బజ్ ఏర్పడకపోవచ్చు.

అదొక్కటే బాధపెట్టే విషయం” అంటూ చెప్పుకొచ్చారు చిరు. ‘ఆచార్య’ సినిమా ఫలితం తేడా కొట్టడానికి దర్శకుడు కొరటాలే కారణమన్నట్టు చిరు చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ‘ఆచార్య’ సినిమాని కొరటాల కనుక డైరెక్ట్ చేసి ఉంటే ఫలితం ఇలా ఉండదు అంటూ అభిమానులే చెబుతున్న వేళ చిరు ఇలా అనడం ఆలోచించదగ్గ విషయం.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus