స్టార్ హీరోలు అంటే కమర్షియల్ సినిమాలు అనే ఛట్రంలో ఇరుక్కుంటారు అనే మాట ఉంది. గతంలో చాలామంది హీరోలు ఇలానే ఇరుక్కుని లాక్కోలేక పీక్కోలేక ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్‌కు స్టిక్ కాకుండా కొంతమంది హీరోలు రకరకాల సినిమాలు చేస్తున్నారు. వరుసగా రెండు సినిమాలు ఒకేలా ఉండకుండా చూసుకుంటున్నారు. ఇమేజి ఛట్రంలో ఇరుక్కున్న హీరోల్లో మెగా ఫ్యామిలీ హీరోలు కూడా ఉన్నారు. ఈ మాటను ఆ ఫ్యామిలీ పెద్ద మెగాస్టార్ చిరంజీవే చెప్పారు. అయితే ఆ లిస్ట్‌లో వరుణ్‌తేజ్ లేడు అని కూడా చెప్పారు.
వరుణ్‌తేజ్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. మానుషి చిల్లార్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను శక్తిప్రతాప్ సింగ్ తెరకెక్కించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారరు. అందులో చిరంజీవి మాట్లాడుతూ మా కుటుంబంలో మిగతా హీరోలెవరికీ రాని అవకాశం వరుణ్‌తేజ్‌కు వచ్చిందని చెప్పారు. వరుణ్ మొదటి నుంచీ వైవిధ్యభరితమైన కథలతోనే ప్రయాణం చేస్తున్నాడు అంటూ పొగిడేశారు. చిరంజీవి అన్నట్లు మెగా ఫ్యామిలీ హీరోల సినిమాల్లో వైవిధ్యం చూపిస్తున్నది వరుణే.
శక్తిప్రతాప్ ఈ సినిమా కమర్షియల్ ఆలోచనతో చేయలేదని, అంతేకాదు ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని దేశానికి సేవలు చేసే భారత ఆర్మీపై పరిశోధన చేస్తుంటారని తెలిపారు. అలాగే ఈ చిత్రాన్ని కూడా తను ఎంతో పరిశోధన చేసి వాస్తవికంగా ఉండేలా తెరకెక్కించారు అని తెలిపారు. ఈ సినిమాని తక్కువ బడ్జెట్‌లో 75 రోజుల్లోనే నాణ్యతతో తెరకెక్కించారని మెచ్చుకున్నారు. ట్రైలర్‌లో కనిపించిన విమానాలు, విజువల్స్ చూస్తుంటే తక్కువ బడ్జెట్‌లో నాణ్యమైన సినిమా తీశారా అని ఆశ్చర్యమేసిందని చెప్పారు చిరంజీవి.
డబ్బు ఖర్చు పెడితేనే రిచ్‌నెస్ రాదు.. అది మన ఆలోచనల్లో ఉండాలి అని (Chiranjeevi) చిరంజీవి కామెంట్ చేశారు. తక్కువ బడ్జెట్‌లో తీసి ఎలా రిచ్‌గా చూపిస్తే బాగుంటుందో దర్శకులు ఆలోచించాలి అని కూడా హితవు పలికారు. అలా చేస్తేనే నిర్మాతలు బాగుంటారు, తద్వారా సినిమా పరిశ్రమ బాగుంటుంది అని చెప్పారు. ఇక ఈ సినిమాను చూసి విజయవంతం చేసి మన వీర సైనికులకు సెల్యూట్ చేయాల్సిన బాధ్యత అందరిదీ అని చిరంజీవి చెప్పారు.
జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!