Chiranjeevi, Pawan Kalyan: ఆ విషయంలో చిరు పవన్ సేమ్ టు సేమ్.. సురేఖ కామెంట్స్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినీ కెరీర్ సాధించిన రికార్డులు అన్నీఇన్నీ కావు. చిరంజీవి ఎలాంటి రోల్ లో నటించినా ఆ పాత్రకు ప్రాణం పోస్తారు. చిరంజీవి భార్య సురేఖ తాజాగా ఒక సందర్భంలో చిరంజీవి ఆహారపు అలవాట్ల గురించి షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. చిరంజీవి గారు భోజనం విషయంలో అస్సలు ఆలోచించరని ఆమె కామెంట్లు చేశారు. చిరంజీవి గారు ఏది పెట్టినా తినేస్తారని చివరకు పచ్చడి అన్నం పెట్టినా సంతృప్తిగా తింటారని సురేఖ చెప్పుకొచ్చారు.

(Pawan Kalyan) కళ్యాణ్ బాబుది కూడా వాళ్ల అన్నయ్య చిరంజీవి వరసేనని ఆమె కామెంట్లు చేశారు. (Nagendra Babu) నాగబాబుకు మాత్రం అలా కాదని అన్ని రుచులు కావాలని సురేఖ చెప్పుకొచ్చారు. మామయ్య గారు చక్కగా తినేవారని అదొక కళ అని తినేవాళ్లకు పెట్టడంలో సంతృప్తి వేరని ఆమె కామెంట్లు చేశారు. మా అమ్మ వాళ్లింట్లో నేనే చిన్నదాన్ని అని పెళ్లి తర్వాతే వంట నేర్చుకున్నానని సురేఖ వెల్లడించారు. వంటలో మా ఆయనే నాకు గురువని ఆమె చెప్పుకొచ్చారు.

కాపురానికి వెళ్లిన తర్వాత ఒకరోజు నేను ఉప్మా చేస్తే ఉండలు ఉండలుగా వచ్చిందని సురేఖ పేర్కొన్నారు. మా ఇంట్లో ఉప్మా ఇప్పుడు చాలా ఫేమస్ అని అడిగి మరీ తింటారని సురేఖ చెప్పుకొచ్చారు. మరోవైపు పవన్ కళ్యాణ్ మూడు రోజుల క్రితం సురేఖ వండిన చికెన్ బిర్యానీ రుచి చూశారని సమాచారం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.

చిరంజీవి, పవన్ ఫుల్ లెంగ్త్ రోల్స్ లో ఒక సినిమా కావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా అభిమానుల కోరిక ఎప్పటికి తీరుతుందో చూడాల్సి ఉంది. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలపై దృష్టి పెట్టనున్నారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి తమ సినిమాలతో ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.

గామి సినిమా రివ్యూ & రేటింగ్!

భీమా సినిమా రివ్యూ & రేటింగ్!
వళరి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus