Mrunal Thakur: ‘ఫ్యామిలీ స్టార్‌’ గురించి మృణాల్‌ నిజమే చెప్పిందా? వాళ్లంతా నటించారా?

‘ఫ్యామిలీ స్టార్‌’(Family Star)… ఇప్పుడు టాలీవుడ్‌లో యూత్‌ మొత్తం ఈ సినిమా గురించే మాట్లాడుతోంది. ప్రచార చిత్రాలతో ఈ సినిమా మీద ఇప్పటికే భారీగా అంచనాలు మొదలయ్యాయి. విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) – మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) జోడీ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. వారి మధ్య కెమిస్ట్రీ బాగా పండిందని, వెండితెరపై చూసి కుర్రకారు లైక్‌ చేస్తారని చెబుతున్నారు. ఇక విజయ దేవరకొండ – పరశురాం (Parasuram) కాంబినేషన్‌ గతంలో అందుకున్న విజయం కూడా ఇక్కడ పాయింటే. అయితే ఇప్పుడు మృణాల్‌ చెప్పిన మరో మాట సినిమా మీద అంచనాల్ని ఇంకా పెంచేసింది.

‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. భారీ స్థాయిలో ఇటీవల ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కూడా నిర్వహిచారు. అటు విజ‌య్ దేవ‌రకొండ‌, ఇటు మృణాల్ ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో మృణాల్ ఠాకూర్ సినిమా గురించి మాట్లాడుతూ… ఈ సినిమాలో కొన్ని క్యామియోస్‌ను చూడ‌బోతున్నాం అని చెప్పారు. అవును, ఈ సినిమాలో దిల్‌ రాజు (Dil Raju)  క‌నిపిస్తార‌ట కదా అని మృణాల్‌ని అడిగితే… ‘‘అవును ఈ సినిమాలో కామియోస్‌ ఉన్నాయి. షారుఖ్‌ ఖాన్(Shah Rukh Khan) , చిరంజీవి(Chiranjeevi) , ప్ర‌భాస్ , దుల్కర్ (Dulquer Salmaan) , సాయి ప‌ల్ల‌వి (Sai Pallavi) , క‌మల్ హాస‌న్ (Kamal Haasan) ఉన్నారు’’ అని చెప్పింది.

అంతేకాదు తనకు న‌చ్చిన చాలామంది ఈ సినిమాలో క‌నిపిస్తారని చెప్పింది. చిరంజీవితో సినిమా చూడ‌టం ఇష్ట‌మే. ప్ర‌భాస్ కోసం ఈ సినిమా క‌చ్చితంగా చూడాలి అంటూ ఏదో చెప్పింది మృణాల్‌. అయితే ఇదెంతవరకు నిజం, నిజంగానే వాళ్లు చిన్న పాత్రలు చేశారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో కొన్ని సందర్భాల్లో పైన చెప్పిన నటులు ఒక్కొక్కరు కనిపిస్తారు అని అంటున్నారు. లేదంటే తెరపై చూపించడం లాంటివి ఉంటాయి అని మరో టాక్‌ వినిపిస్తోంది.

ఇక మృణాల్‌ సంగతి చూస్తే… ఈ సినిమా తర్వాత ప్రభాస్‌ (Prabhas) – హను రాఘవపూడి (Hanu Raghavapudi) సినిమాలో నటిస్తోందని అంటున్నారు. అలాగే చిరంజీవి ‘విశ్వంభర’లోనూ (Vishwambhara) నటిస్తోంది అని చెబుతున్నారు. అయితే ఈ విషయాల్లో ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus