ఎంత సంపద ఉన్నా కూడా కొందరు ఎదుటి మనిషికి సహాయం చేయడానికి ఎంతో ఆలోచిస్తారు. ఇక కొందరు సహాయం చేసినా కూడా ఇంతేనా అంటుంటారు. విమర్శలు పట్టించుకుంటే ఈ ప్రపంచంలో సహాయలు చేయడం చాలా కష్టం. ఇక అలాంటి విషయాలను ఎన్నడూ పట్టించుకోని మెగాస్టార్ చిరంజీవి తన శక్తి మేర ప్రతిసారి ఎదో ఒక విధంగా ఇతరులకు ఉపయోగపడుతూనే ఉన్నాడు. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు.
ఇక కోవిడ్ కష్ట కాలంలో సహాయం చేసేందుకు ఇదివరకే విరాళాలు ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇటీవల మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. బ్లడ్ బ్యాంక్ తరహాలోనే చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ లను కూడా తెలుగు రాష్ట్రాల్లో సరఫరా చేసేందుకు ముందుకు వచ్చారు. కోవిడ్ 19 వలన ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. ఇక మెగాస్టార్ మొదలు పెట్టిన ఆక్సిజన్ బ్యాంక్ వినియోగం రోజురోజుకు మరింత పెరుగుతోంది. మొదట్లో అనుకున్న బడ్జెట్ కంటే ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతోందట.
అయినప్పటికీ రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి ఈ సహాయలు ఎంతమాత్రం ఆగకూడదు అని మరింత ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఆక్సిజన్ ప్లాంట్ అంటేనే కోట్లకు పైగా ఖర్చు అవుతోంది. ఇక జిల్లా జిల్లాకు ఆక్సిజన్ పంపించాలి అంటే అంత సాధారణమైన విషయం కాదు. మొత్తంగా ఎంత ఖర్చు చేస్తున్నారో తెలియదు గాని ఆ ఆక్సిజన్ సిలిండర్స్ కారణంగా ఎంతో మంది చావు నుంచి బయటపడుతున్నారు.
Most Recommended Video
ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!