విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు.. ఈ పేరు తెలియని తెలుగు వారుండరు.. తెలుగు వారి కథానాయకుడు, ప్రజా నాయకుడు, రాముడు, కృష్ణుడు ఆయనే.. ఇంటింటికీ తిరిగి పాలు పోసే రామారావు.. ప్రతి ఇంట్లోనూ తన ఫోటో పెట్టుకునే స్థాయికి ఎదిగారు. రాజకీయాల్లోనూ పెను సంచలనం సృష్టించారు. చిత్ర పరిశ్రమలో ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆయన అభిమానిగా వచ్చిన కృష్ణ కూడా కొత్త చరిత్రను లిఖించారు. అటువంటి ఎన్టీఆర్ అంటే ఎవరికి అభిమానముండదు చెప్పండి?.. దాదాపు అందరూ ఆయన అభిమానులే..
తర్వాతి తరంలో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ వంటి స్టార్స్.. గత శతాబ్దం (2000) సమయంలో ఎన్టీఆర్ చివరి జన్మదినం సందర్బంగా.. మీడియా వారు పెద్దాయన గురించి అడగ్గా.. ఆ మహనీయుడి గురించి మాట్లాడడం గొప్ప అవకాశంగా భావిస్తున్నామంటూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఎన్టీఆర్ గారిని తొలిసారి అక్కడే చూశాను – చిరంజీవి..
నాకు ఊహ తెలిసిన తర్వాత తొలిసారిగా చూసిన రామారావు గారి సినిమా.. ‘పాతాళభైరవి’.. ఆ తర్వాత దాదాపుగా అన్ని సినిమాలు చూశాను.. ఆయన స్ఫురద్రూపం, ముఖవర్చస్సు, అభినయం, వాచకం, గాంభీర్యం.. ఇవన్నీ చూస్తుంటే.. కోట్ల మంది ప్రజల్ని అలరించడానికే ఆయన్ని భగవంతుడు పుట్టించాడా అనిపిస్తుంటుంది. రాముడు, కృష్ణుడు వేషాలలో రామారావు గారిని చూస్తే నిజంగా రాముడు, కృష్ణుడు దిగి వచ్చారా అన్న భావన కలిగేది.. పౌరాణిక పాత్రల పోషణ ద్వారా ప్రేక్షకుల్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తారు.
నర్సాపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో సెలవులప్పుడు హైదరాబాద్ వచ్చాను. అప్పుడు రామకృష్ణ కాంప్లెక్స్‌లో ఏదో సినిమా చూడడానికి వెళ్లాను. అప్పుడక్కడ ఏదో ఓపెనింగ్‌కి రామారావు, దేవిక, జమున గార్లు వస్తున్నారని చెప్పారు. అంతమంది జనాల్లో ఆయన్ని చూడడం నాకో మధురానుభూతి.. సినీ పరిశ్రమకి వచ్చాక ఆయనతో కలిసి నటించిన ‘తిరుగులేని మనిషి’ షూటింగ్ అప్పుడే వారిని నేరుగా కలవడం.. పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నాను.. రామారావు గారితో కలిసి నటించింది ఒక్క సినిమానే అయినా నా మధుర జ్ఞాపకాలలో ఒకటయింది..
రైటర్ పద్మభూషణ్ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!
మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!