Chiranjeevi: బలగం మొగిలయ్యకు అండగా నిలిచిన మెగాస్టార్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడుగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి గొప్ప నటుడుగా మాత్రమే కాకుండా…. మంచి మనసున్న వ్యక్తిగా కూడా పేరు ప్రఖ్యాతలు పొందారు.ఇప్పటికే ఈయన బ్లడ్ బ్యాంక్ అంటూ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అలాగే ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సెలబ్రిటీలు కనుక ఇబ్బందులలో ఉంటే వారిని ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలకు తనదైన శైలిలో సహాయం చేస్తూ వారికి అండగా నిలిచిన చిరంజీవి తాజాగా బలగం మొగిలయ్యకు కూడా భరోసా ఇచ్చారు.

బలగం సినిమాలో క్లైమాక్స్ పాట ద్వారా అందరిని ఆకట్టుకున్నటువంటి సింగర్ మొగిలయ్య గత కొద్దిరోజులుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా కిడ్నీ సమస్యతో పాటు ఈయన చాలా కాలం నుంచి మధుమేహ సమస్యతో బాధపడుతూ ఉండగా తన చూపు కోల్పోవడమే కాకుండా గుండె సమస్యలకు కూడా గురయ్యారు. ఇలా ఈయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఆయనని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇలా నిమ్స్ లో ఆయనకు మెరుగైన వైద్యం అందుతుంది.

ఈయన ఆరోగ్యం పై సెలబ్రిటీలు స్పందిస్తూ ఆయనకు సహాయం చేశారు. ఈ క్రమంలోనే (Chiranjeevi) చిరంజీవి సైతం మొగిలయ్యకు అండగా నిలిచారు.మధుమేహ వ్యాధి కారణంగా మొగిలయ్య కంటి చూపును కోల్పోయిన విషయం మనకు తెలిసిందే. అయితే ఆయనకు తిరిగి చూపు తీసుకొచ్చే బాధ్యత చిరంజీవి తీసుకున్నారు. ఈ క్రమంలోనే బలగం డైరెక్టర్ వేణుకి మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేసి మొగిలయ్యకు కంటిచూపు తీసుకువచ్చే బాధ్యత తనదేనని అందుకు ఎంత ఖర్చైనా ఆ ఖర్చులు మొత్తం తానే భరిస్తానని తెలియజేశారు.

ఇక ఇదే విషయాన్ని వేణు మొగిలయ్య దంపతులకు తెలియజేయగా వారు ఈ విషయాన్ని ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తెలియజేశారు.ఇక మొగిలయ్య ఆరోగ్య విషయంలో మెగాస్టార్ చొరవ తీసుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus