Chiranjeevi, Bobby: చిరు బాబీ సినిమాలో ట్విస్ట్ ఇదే?

మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఒకే సమయంలో చిరంజీవి ఏకంగా నాలుగు సినిమాలలో నటిస్తున్నారు. చిరంజీవి బాబీ కాంబినేషన్ లో వాల్తేరు వీరయ్య పేరుతో ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ మొదలైంది. బాబీ మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. అభిమానులు చిరంజీవిని ఏ విధంగా చూస్తారో అదే విధంగా బాబీ చూపిస్తానని గతంలో చెప్పారు.

చిరు బాబీ మూవీ ప్రీ లుక్ లో చిరంజీవి ముఠామేస్త్రి తరహాలో ఉండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి కూలీ పాత్రలో నటిస్తున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో చిరంజీవి అండర్ కవర్ కాప్ గా కనిపించనున్నారు. ఇంటర్వెల్ లో చిరంజీవి పోలీస్ అని తెలుస్తుందని సమాచారం. శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలతో బిజీగా ఉన్నారు. వరుసగా సినిమాలలో నటిస్తున్న చిరంజీవి వచ్చే ఏడాది కనీసం మూడు సినిమాలను రిలీజయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. చిరంజీవి భవిష్యత్తు సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. చిరు, చరణ్ కలిసి నటించిన ఆచార్య వచ్చే ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన రిలీజ్ కానుంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus