అవును మెగాస్టార్ చిరంజీవి.. ఓ సందర్భంలో ఎన్టీఆర్ సినిమాకి భయపడి తన సినిమాని వాయిదా వేసిన సందర్భం ఉంది. 19 ఏళ్ళ క్రితం ఈ సంఘటన చోటు చేసుకుంది. ‘ఆది’ సినిమాతో ఫుల్ ఫామ్లో ఉన్నాడు ఎన్టీఆర్. ఆ సినిమా అతనికి బాగా హై ఇచ్చింది. ఆ టైములో అతను ‘అల్లరి రాముడు’ అనే చిత్రం చేసాడు. దీనికి బి.గోపాల్ దర్శకుడు. మరోపక్క ఆయన చిరంజీవితో ‘ఇంద్ర’ మూవీని కూడా కంప్లీట్ చేశారు.
అయితే ఈ రెండు చిత్రాలను మొదట జూలై 18నే విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. కానీ ‘అల్లరి రాముడు’ హిట్ అయ్యి.. ‘ఇంద్ర’ సినిమా ప్లాప్ అయితే చిరు ఇమేజ్ కు ఎఫెక్ట్ పడుతుంది అని అంతా అనుకున్నారు. ‘మృగరాజు’ ‘శ్రీ మంజునాథ’ ‘డాడీ’ వంటి సినిమాలు ఆ టైములో బాగా నిరాశపరిచాయి. చిరు బ్యాడ్ ఫామ్లో ఉన్న రోజులవి. పైగా ‘ఇంద్ర’ సినిమాకి రన్ టైం ఇష్యుస్ కూడా ఉండడంతో… ఓ వారం రోజుల పాటు వాయిదా వేసి జూలై 24న విడుదల చేశారు.
‘అల్లరి రాముడు’ చిత్రం తొలి షోతోనే ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. అయినప్పటికీ ఎన్టీఆర్ క్రేజ్ వలన బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను రాబట్టి యావరేజ్ గా నిలిచింది. మరోపక్క ‘ఇంద్ర’ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం.. ఇండస్ట్రీ హిట్ గా నిలవడం జరిగింది. ఒకవేళ తర్వాతి వారం ‘ఇంద్ర’ సినిమా రిలీజ్ కాకపోయి ఉంటే ‘అల్లరి రాముడు’ కమర్షియల్ సక్సెస్ ను అందుకునేది . అనడంలో సందేహం లేదు.
విచిత్రం ఏంటి అంటే ఈ రెండు చిత్రాలను బి.గోపాల్ తెరకెక్కించడం మాత్రమే కాకుండా, రెండిటిలోనూ హీరోయిన్ గా ఆర్తి అగర్వాల్ నటించింది. ఎన్టీఆర్ కు నందమూరి ఫ్యామిలీకి చెందిన హీరో అయినప్పటికీ… ఓ కొత్త హీరోలనే కష్టపడ్డాడు. మొదట్లో అతన్ని నందమూరి ఫ్యామిలీ చేరదీయలేదు. ఇక ‘అల్లరి రాముడు’ ఫలితం నిరాశపరిచినా.. తర్వాత వచ్చిన ‘సింహాద్రి’ సినిమా హిట్ ఎన్టీఆర్ కు తిరుగులేని స్టార్ డంను తెచ్చి పెట్టింది.