Chiranjeevi: చిరు సినిమా భోళా శంకర్ పై లేటెస్ట్ అప్డేట్!

గతేడాది చిరంజీవి నటించిన ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో ‘ఆచార్య’ డిజాస్టర్ అయింది. ‘గాడ్ ఫాదర్’ మాత్రం ఓ మోస్తరు కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక ఈరోజు మెగాస్టార్ నటించిన ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉండగా.. వేసవికి కూడా ఆయన నటించిన సినిమా వస్తుందని అందరూ అనుకున్నారు.

మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న ‘భోళా శంకర్’ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేయబోతున్నట్లు ఇంతకముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సినిమా చెప్పిన టైంకి వచ్చేలా లేదు. ఆ విషయాన్ని చిరంజీవి స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతానికి ఆ సినిమా షూటింగ్ 30 శాతమే పూర్తయిందని.. ఈ నెల 17 నుంచి కొత్త షెడ్యూల్ మొదలవుతుందని అప్డేట్ ఇచ్చారు చిరు.

కుదిరితే మేలో ‘భోళా శనకర్’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వెల్లడించారు. ఒకవేళ అప్పుడు కుదరకపోతే దసరా రిలీజ్ మీద దృష్టి పెడతామని చిరంజీవి చిరు తెలిపారు. ఏప్రిల్ 14న రజినీకాంత్ ‘జైలర్’ సినిమా రిలీజ్ కానుంది. అలానే మరికొన్ని క్రేజీ సినిమాలను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. వీటితో పాటు చిరంజీవి సినిమా కూడా వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ‘భోళా శంకర్’ వాయిదా పడింది.

ఇప్పటివరకు 30 శాతం షూటింగ్ మాత్రమే పూర్తయిన నేపథ్యంలో చిరంజీవి చెప్పినట్లుగా మేలో సినిమాను రిలీజ్ చేయడం కూడా కష్టమే అనిపిస్తుంది. కాబట్టి దసరా రిలీజ్ కు ఫిక్స్ అయిపోవచ్చు. ఇక ‘భోళా శంకర్’ సినిమా విషయానికొస్తే.. ఇది తమిళ సినిమా ‘వేదాళం’కి రీమేక్. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ ని చాలా మంది చూసేసారు. మరి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మెహర్ రమేష్ సినిమా చేయగలరో లేదో చూడాలి. ఈ సినిమాలో చిరుకి చెల్లెలిగా కీర్తి సురేష్, జోడీగా తమన్నా కనిపించనున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus