దర్శకరత్న దాసరి నారాయణరావు మరణం తరువాత ఇండస్ట్రీ పెద్ద స్థానం అలానే ఉండిపోయింది. మోహన్ బాబు, చిరంజీవి లాంటి పెద్దలు ఆ స్థానంలో కూర్చుంటారనే వార్తలొచ్చాయి. అయితే తనకు అసలు అలాంటి ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. యోధ లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల వారికి లైఫ్ హెల్త్ కార్డులను పంపిణీ చేయడానికి ముందుకొచ్చింది. ఇండస్ట్రీలో పనిచేసే అందరికీ యాభై శాతం రాయితీతో టెస్ట్ లు చేస్తామని ప్రకటించింది.
ఆదివారం నాడు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌లో కార్డుల పంపిణీ జరగ్గా.. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. హెల్త్ కార్డులు పంపిణీ చేస్తూ ఇండస్ట్రీ కార్మికులను ఆదుకుంటున్న యోధ లైఫ్ లైన్ చైర్మన్ సుధాకర్ ను కొనియాడారు చిరు. కరోనా ఎంతో మందిని బలి తీసుకుందని.. ఎంతో మంది ఆప్తుల్ని, మిత్రుల్ని కోల్పోయామని అన్నారు చిరు. ఆరోగ్యం ముఖ్యం కాబట్టి అందర్నీ కాపాడాలని ఆలోచన చేశానని.. దానికి యోధ లైఫ్ లైన్ చైర్మన్ సహకరించారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో భాగంగా.. సినీ కార్మికులు చిరుని రిక్వెస్ట్ చేశారు. ఇండస్ట్రీకి గత కొంతకాలంగా పెద్ద దిక్కు అంటూ ఎవరూ లేరని.. ఆ బాధ్యత చిరంజీవి తీసుకోవాల్సిందిగా కోరారు. మీరు పెద్దగా ఉంటే తమకు ఏదైనా సమస్య వస్తే వెంటనే చిరు ఉన్నారనే ధైర్యం ఉంటుందని మెగాస్టార్‌ను కార్మికులు కోరారు. దీనిపై స్పందించిన చిరు.. ‘పెద్దరికం హోదా నాకు ఇష్టం లేదు. ఆ పదవి నాకొద్దు. కానీ, బాధ్యత గల ఒక బిడ్డగా ఉంటాను.
అందరి బాధ్యతా తీసుకుంటా. అందుబాటులో ఉంటా. అవసరం వచ్చినప్పుడు తప్పకుండా ముందుకు వస్తా. అనవసరమైన వాటికి మాత్రం ముందుకు వచ్చే ప్రసక్తే లేదు. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు, రెండు యూనియన్ల మధ్య వివాదం జరిగితే.. ఆ తగువులు తీర్చాలని నా వద్దకు వస్తే నేను ఆ పంచాయితీ చేయను. కార్మికులకు ఆరోగ్య, ఉపాధి సమస్యలు వచ్చినప్పుడు తప్పకుండా సమగ్ర విశ్లేషణ చేసి వారి కోసం నిలబడతా’ అంటూ చెప్పుకొచ్చారు.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!