Chiranjeevi, Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ పై చిరంజీవి కామెంట్స్..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ మూవీ అక్టోబర్ 5న విజయదశమి కానుకగా రిలీజ్ కాబోతుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ కి ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ తెలుగులో డబ్ అయిన మూవీనే రీమేక్ చేస్తున్నారు అని తెలిసినప్పుడు తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా పై అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఎప్పుడైతే ‘నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను కానీ రాజకీయం నా నుండి దూరం కాలేదు’ అంటూ ఓ డైలాగ్ ను పోస్ట్ చేసి ఈ సినిమాపై హైప్ పెరిగేలా చేశారు చిరు.

అటు తర్వాత రిలీజ్ చేసిన ట్రైలర్ కు కూడా రెస్పాన్స్ లభించింది. మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకుడు. ఒరిజినల్ తో పోలిస్తే ఈ మూవీకి అతను చాలా మార్పులు చేశాడు. పైగా అతను రీమేక్ చేస్తే సినిమా కచ్చితంగా హిట్ అనే సెంటిమెంట్ ఉంది. కాబట్టి ఈ సినిమా పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా.. ‘గాడ్ ఫాదర్’ ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు చిరు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో రాజకీయాల్లో ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ పై కూడా అతను స్పందించారు.

చిరంజీవి మాట్లాడుతూ.. “నేను జ‌న‌సేన పార్టీకి మ‌ద్ద‌తు ఇస్తాను అని గతంలో ఎప్పుడూ చెప్పలేదు..! భ‌విష్య‌త్తులో కూడా మద్దతు పలుకుతానో లేదో తెలీదు. నేను ఏ ప‌క్షాన ఉంటాననేది కాలం, ప్ర‌జ‌లు నిర్ణ‌యిస్తారు. కానీ నా త‌మ్ముడి నిబద్ద‌త గురించి నాకు తెలుసు. ప‌వ‌న్ కళ్యాణ్ లాంటి నిబ‌ద్ద‌త ఉన్న నాయ‌కుడు మ‌న‌కు రావాలి. నా ఆకాంక్ష కూడా అదే..దానికి నా మ‌ద్ద‌తుంటుంది. నేను కూడా రాజకీయాల్లో ఉండి మేమిద్ద‌రం చెరొక వైపు ఉండ‌టం

కంటే నేను ప‌క్క‌కు త‌ప్పుకోవ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని రాజకీయాల నుండి తప్పుకోవడం జరిగింది. ఈ నిర్ణ‌యం ప‌వ‌న్‌ కళ్యాణ్ కు సాయ‌మవుతుందేమో అని అనుకున్నాను. ప‌వ‌న్‌కు రాష్ట్రాన్ని పరిపాలించే అవ‌కాశం ప్ర‌జ‌లు ఇచ్చే రోజు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను.ప‌వ‌న్ నా త‌మ్ముడు..అతను కచ్చితంగా మంచి నాయ‌కుడు అవుతాడు అనే నమ్మకం కూడా నాకు ఉంది” అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus