ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనకు రాజ్యసభ టికెట్ అఫర్ చేశారని వస్తోన్న వార్తలను మెగాస్టార్ చిరంజీవి కొట్టిపారేశారు. వరుసగా రెండోరోజు విజయవాడలో దర్శనమిచ్చిన చిరంజీవి రాజ్యసభ టికెట్ అని వినిపిస్తున్న వార్తలు కేవలం రూమర్లు మాత్రమేనని మీడియాకు తెలిపారు. గురువారం నాడు వైఎస్ జగన్ తో చిరంజీవి భేటీ అయిన సంగతితెలిసిందే . ఈ భేటీపై అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఇన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న చిరు ఇప్పుడు భేటీకి వెళ్లారంటూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇది సినీ రంగానికి సంబంధించిన భేటీనా.. లేకుంటే రాజకీయంగా ఏదైనా విషయాలపై చర్చించారా..? అంటూ సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి. దీనిపై స్పందించిన చిరు.. ”తెలుగు సినీ పరిశ్రమ మేలుకోసం,థియేటర్ల మనుగడ కోసం,ఆంధ్రప్రదేశ్ సి.ఎం శ్రీ వై స్ జగన్ గారిని కలిసి చర్చించిన విషయాలని పక్కదోవ పట్టించే విధంగా,ఆ మీటింగ్ కి రాజకీయరంగు పులిమి నన్ను రాజ్యసభకు పంపుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి.
అవన్నీ పూర్తిగా నిరాధారం. రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేను మళ్లీ రాజకీయాలలోకి,చట్టసభలకు రావటం జరగదు. దయచేసి ఊహాగానాలని వార్తలుగా ప్రసారం చేయవద్దు. ఈ వార్తలకి,చర్చలకు ఇప్పటితో పుల్ స్టాప్ పెట్టమని కోరుతున్నాను” అంటూ ట్విట్టర్ వేదికగావెల్లడించారు .
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!