Sreeja: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ లేటెస్ట్ పోస్ట్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు కొణిదెల శ్రీజని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈమె గతం గురించి కూడా అందరికీ తెలుసు. శ్రీజ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.తన పిల్లల లేటెస్ట్ ఫొటోలతో పాటు… తనకు సంబంధించిన విషయాలు, అభిప్రాయాలను తన ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు ఫారెన్‌ టూర్ లకు కూడా వెళ్లొస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా.. శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్ నుండి సెపరేట్ గా ఉంటున్న సంగతి తెలిసిందే.

చాలా కాలం నుండి వీరు వేరుగా ఉంటున్నారు. వీరిద్దరికీ ఓ పాప కూడా ఉంది. అయితే వీరి మధ్య మనస్పర్థలు రావడం వల్ల విడిగా ఉంటున్నారు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. వీటి పై వీళ్ళు క్లారిటీ అయితే ఇవ్వలేదు కానీ.. అప్పటి నుండి వీళ్ళు ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అవుతూనే ఉంది. తాజాగా శ్రీజ పెట్టిన ఓ పోస్ట్ కూడా వైరల్ గా మారింది. ‘నా జీవితంలోకి పంపినందుకు ఆ దేవుడికి థాంక్స్’ అంటూ ఎమోషనల్ గా స్పందించింది శ్రీజ.

విషయం ఏంటంటే.. శ్రీజ (Sreeja) తన స్నేహితురాలు స్వాతి నిమ్మగడ్డ పుట్టినరోజు వేడుకకు వెళ్ళింది. అక్కడ స్వాతి నిమ్మగడ్డతో దిగిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. స్వాతి.. ప్రముఖ బిజినెస్ మెన్ ప్రసాద్ నిమ్మగడ్డ కూతురు అన్న సంగతి తెలిసిందే. చిరంజీవి, నాగార్జున కుటుంబాలకు అతను అత్యంత సన్నిహితుడు. వీరి కుటుంబాల మధ్య కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. శ్రీజ – స్వాతి కూడా బెస్ట్ ఫ్రెండ్స్. అందుకే ఇలా ఎమోషనల్ కామెంట్ పెట్టినట్టు స్పష్టమవుతుంది.


ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus