మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినిమా చరిత్రలో ఈ పేరు సువర్ణాక్షరాలతో లిఖింపబడుతుంది అనడంలో అతిశయోక్తి అనిపించుకోదు. ఎందుకు అనేది ఇప్పటి తరానికి తెలిసుండకపోవచ్చు. కానీ 90ల జనాలకి ఆ విషయం తెలుసు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ , శోభన్ బాబు వంటి స్టార్లు టాలీవుడ్ ను ఏలుతున్న రోజుల్లో.. సినిమాల్లోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. స్టార్ గా ఎదగడానికి 60 సినిమాలు పట్టాయి. ‘ఖైదీ’ సినిమాతో చిరంజీవికి స్టార్ ఇమేజ్ వచ్చింది.
అది చిరుకి 60 వ సినిమా..! ఆ తర్వాత ఈయన రేంజ్ బాగా పెరిగింది. అయితే ‘ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఎలా తట్టుకుని నిలబడాలి, అలాంటి అవమానాలను ఎలా తీసుకోవాలి?’ అని చిరంజీవికి ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన సమాధానం ఇస్తూ.. ‘నా జీవితంలో జరిగిన ఓ అనుభవం గురించి మీకు చెప్పుకోవాలి. నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రచారం కోసం జగిత్యాల వెళ్ళాను. అక్కడ స్టార్టింగ్ లో నా పై పూల వర్షం కురిపించారు.
చాలా సంతోషంగా అనిపించింది. ఆ తర్వాత నేను ప్రసంగిస్తున్న సమయంలో కొంతమంది నా పై కోడిగుడ్లు విసిరారు. సో పూల వర్షం కురిసినప్పుడు పొంగిపోకూడదు, కోడిగుడ్ల దెబ్బలు తగిలినప్పుడు కృంగిపోకూడదు.. అని అప్పుడు నాకు అర్థమైంది. ఏదేమైనా ఎలాంటి దెబ్బలు తగిలినా ముందుకు వెళ్ళాలి అని నేను తెలుసుకున్నాను’ అంటూ చిరు చెప్పుకొచ్చారు. ఇక వరుస సినిమాలతో (Chiranjeevi) చిరు బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.
జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!