Chiranjeevi: సినీ పరిశ్రమ పై చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా చలామణి అవుతున్నారు. పరిశ్రమకి ఎటువంటి సమస్య వచ్చినా దగ్గరుండి పరిష్కరిస్తున్నారు. 10 ఏళ్ళు ఇండస్ట్రీకి దూరమైన ఆయన ఇప్పుడైతే ఇండస్ట్రీని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు అనే చెప్పాలి. అయితే 2007 లో చిరంజీవి .. ‘ గోవా ఫిల్మ్ ఫెస్టివల్ కు వెళితే అక్కడ తెలుగు వాళ్ళ ఫోటో లేదు, ఇండియన్ సినిమా అంటే వాళ్ళు తెలుగు సినీ హీరోలు కాదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

మొత్తానికి 15 ఏళ్ళ అవేదనకి ఫలితం దక్కింది.గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకల్లో చిరంజీవి పాల్గొన్నారు.ఆయన ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఆ అవార్డును స్వీకరించిన మెగాస్టార్ ఆ తర్వాత సినీ పరిశ్రమ గురించి అగ్రెసివ్ స్పీచ్ ఇచ్చారు. “అవినీతి లేని ఏకైక రంగం. ఇక్కడ టాలెంట్‌ ఉంటేనే ఎదుగుతాం. నాకు యువ హీరోలు పోటీ కాదు.. నేనే వాళ్లకు పోటీ.

ఈ అవార్డు నాలోనూ అలాగే నా అభిమానుల్లోనూ నూతన ఉత్సాహాన్ని నింపుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నేను ఎప్పుడూ మీతోనే ఉంటాను.నా చివరి శ్వాస వరకు సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. తెలుగు ప్రేక్షకుల ప్రేమాభిమానాలే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చాయి. నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు గాను ప్రధాని మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు ” అంటూ చెప్పుకొచ్చారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus