Chiranjeevi: ఎత్తర జెండా తరహా సాంగ్ లో చిరు నటించారా.. వీడియో వైరల్!

రాజమౌళి (S. S. Rajamouli)  డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలోని ఎత్తర జెండా సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్లైమాక్స్ పూర్తైన తర్వాత వచ్చే ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతో మెప్పించింది. ఎత్తర జెండా వీడియో సాంగ్ కు యూట్యూబ్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. అయితే ఇదే తరహా సాంగ్ లో చాలా సంవత్సరాల క్రితం చిరంజీవి (Chiranjeevi) నటించగా ఆ వీడియో వైరల్ అవుతోంది.

ఈ సాంగ్ కన్నడ మూవీ సాంగ్ కాగా ఈ సాంగ్ లో ఉన్న సెట్ కూడా ఎత్తర జెండా తరహాలో ఉన్న విధంగానే ఉంది. చిరంజీవి సాంగ్ ను చూసి ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతవుతోంది. ఒక ఇన్ స్టాగ్రామ్ పేజ్ షేర్ చేసిన ఈ వీడియోకు రికార్డ్ స్థాయిలో లైక్స్ వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై రెండు సంవత్సరాలైనా ఈ సినిమా ప్రభావం ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఉందనే సంగతి తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ మూవీ ఇప్పటికీ స్టార్ మా ఛానల్ లో ప్రసారమైతే మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్, చరణ్ (Ram Charan) ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉండగా దేవర (Devara) మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుందని క్లారిటీ ఉన్నా గేమ్ ఛేంజర్ (Game changer) మూవీ ఈ ఏడాదే విడుదలవుతుందో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ లేకపోవడమే ఈ సినిమాకు సమస్య అవుతోంది.

గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన జరగండి సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇండియన్2 (Indian 2) సినిమా విడుదలైతే మాత్రమే గేమ్ ఛేంజర్ ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తిస్థాయిలో పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇండియన్2 మూవీ ఈవెంట్ కు రామ్ చరణ్ కూడా హాజరు కానున్నారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం.

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus