Chiranjeevi: చిరు అలాంటి సన్నివేశాల్లో నటిస్తే వాళ్ళకు నచ్చదట..!

మెగాస్టార్ చిరంజీవి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోగా నటించారు. అంతేకాదు మరికొన్ని సినిమాల్లో విలన్ గా అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కూడా నటించారు. అలాంటి టైం లో 1983లో వచ్చిన ‘ఖైదీ’ చిత్రం ఈయనకి స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. అప్పటి నుండీ ఆయన సుప్రీమ్ హీరోగా మారాడు. అలా వచ్చిన స్టార్ ఇమేజ్ ను కాపాడుకుంటూ.. ఎట్ ది సేమ్ టైం అభిమానులను అలరించే మాస్ ఎలిమెంట్స్ తో కూడుకున్న సినిమాలను ఆయన చేస్తూ వచ్చారు.తన డ్యాన్స్ లతో విమర్శకులతో సైతం ప్రశంసలు దక్కించుకున్న ఘనత మెగాస్టార్ చిరంజీవి గారిది.

అయితే కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడుకున్న సినిమాలను చేసి బోర్ కొట్టిన టైములో.. ఆయన తనలో ఉన్న నటుడిని సంతృప్తి పరచడం కోసం రుద్రవీణ, చంటబ్బాయ్, వేట వంటి సినిమాలు చేశారు. కానీ అవి కమర్షియల్ సక్సెస్ అందించలేదు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే… తాను నటించిన రెండు సినిమాలు అభిమానులను ఇబ్బంది పెట్టాయట. అలా అని సినిమాలు మొత్తం కాదు.. ఓ సారి స్టార్ ఇమేజ్ వచ్చాక తమ అభిమాన హీరోని డౌన్ చేసి చూపిస్తే అభిమానులు తట్టుకోలేరు.సరిగ్గా ఇలాగే ‘ఆపద్బాంధవుడు’ ‘స్నేహం కోసం’ సినిమాల్లో కొన్ని సీన్ల వల్ల మెగా అభిమానులు నిరసనకు దిగారట.

అవేంటంటే.. ‘ఆపద్బాంధవుడు’ సినిమాలో మెగాస్టార్ కు షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు. అప్పుడు కాస్త నత్తిగా మాట్లాడతారు. అలాగే ‘స్నేహం కోసం’ సినిమాలో పెద్ద చిరంజీవి.. తన స్నేహితుడి ఇంటికి వచ్చినప్పుడు.. చెప్పులు తీసి పక్కన పెడతాడు. ఈ సన్నివేశాలు అభిమానులకు నచ్చలేదట.ఈ సినిమాలు ప్రదర్శింపబడుతున్న థియేటర్ల వద్ద షోలు ఆపేయాలంటూ నిరసన వ్యక్తం చేశారట. తర్వాత చిరు దీని గురించి ఓ ఇంటర్వ్యూ ఇచ్చి ‘పాత్ర స్వభావం అలాంటిది.. కథ రీత్యా అలా చేయడం జరిగిందని సర్ధి చెప్పి అభిమానులను కూల్ చేసినట్టు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus