Chiranjeevi: ‘సైరా’ కంటే ముందే చిరంజీవి చేసిన పాన్ ఇండియా సినిమా ఏదంటే..?

‘బాహుబలి’ సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా అనేది ఒకటి ఉంది అని చాలా మందికి తెలిసింది.. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం వంటి సౌత్, నార్త్ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయడం అనేది మేకర్స్‌కి కాస్త కొత్తగా అనిపించింది.. తర్వాత కన్నడ సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాయి.. అయితే అందరూ పాన్ ఇండియా రిలీజ్ చేస్తామంటే కుదరదు.. కాన్సెప్ట్ యూనిక్‌గా ఉండాలి.. కథలో యూనివర్సల్ అప్పీల్ ఉండాలి..

ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి తొలి తరం హీరోలు కూడా అప్పట్లోనే పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేశారు.. ఎన్టీఆర్ చండీరాణి, పాతాల భైరవి వంటి పాన్ ఇండియా ఫిలింస్ చేశారు.. అక్కినేని నాగేశ్వరరావు కూడా సువర్ణ సుందరి వంటి సినిమాలతో హిందీ ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత వీళ్లిద్దరు తెలుగు చిత్ర సీమనే ఏలారు.. మెగాస్టార్ చిరంజీవి హిందీలో కొన్ని సినిమాలు చేశారని తెలుసు కానీ.. దాదాపు 22 ఏళ్ల క్రితమే పాన్ ఇండియా రేంజ్‌లో హంగామా చేశారనే సంగతి చాలా మందికి తెలియదు..

(హిందీలో రీమేక్, ఇతర భాషల్లో డబ్బింగ్) ఆ మూవీ ఏంటి?.. ఎప్పుడు రిలీజ్ అయింది వంటి విశేషాలు ఇప్పుడు చూద్దాం.. ‘గ్యాంగ్ లీడర్’.. చిరంజీవి, విజయ శాంతి జంటగా.. విజయ బాపినీడు దర్శకత్వంలో.. మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది.. తర్వాత హిందీలో చిరంజీవి, మీనాక్షి శేషాద్రి (ఆపద్భాంధవుడు ఫేమ్) జంటగా.. రవిరాజా పినిశెట్టి డైరెక్షన్లో ‘ఆజ్ కా గూండా రాజ్’ పేరుతో రీమేక్ చేశారు.

చిరు నటించిన రెండో హిందీ సినిమా ఇది.. తమిళంలో విడుదల చేస్తే అక్కడా సూపర్ హిట్ అయింది.. తమిళ్ వెర్షన్ మలయాళంలో డబ్ చేస్తే అక్కడా అదరగొట్టేసింది.. కన్నడలోనూ బాగా ఆడిందని సమాచారం.. ఈ లెక్కన ఇప్పుడంతా పాన్ ఇండియా అంటున్న ఆ రేర్ ఫీట్ అనే దాన్ని 1991 టైంలోనే టచ్ చేశారు చిరు.. రీ ఎంట్రీ తర్వాత చేసిన ‘సైరా’ ని హిస్టారికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించి పాన్ ఇండియా ఫిలింగా రిలీజ్ చేశారు కానీ అనుకున్నంతగా ఆడలేదు..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus