చిరంజీవి ఏదైనా సినిమా ప్రెస్‌మీట్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వస్తే కచ్చితంగా లీక్‌లు ఉంటాయి. ఒక్కోసారి తన సినిమా గురించే కాకుండా, తనకు తెలిసిన వాళ్ల సినిమా విషయాలు కూడా లీక్ చేసేస్తుంటారు. అయితే వీటితోపాటు మరొకటి కూడా జరుగుతూ ఉంటుంది. హీరోయిన్లతో చిన్నగా చిలిపి పనులు చేస్తుంటాడు. సినిమాల్లోని సీన్స్ గుర్తు చేస్తూ చిరు చేసే ఆ పనులు ఫుల్ ఫన్ అయితే ఇస్తాయి. అభిమానులు అయితే కిర్రాక్ అంటూ ఉంటారు. తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ ప్రెస్ మీట్లోనూ ఒకటి అలాగే జరిగింది.
‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ‘బాస్ పార్టీ’ అనే పాటలో బాలీవుడ్ బొమ్మ ఊర్వశీ రౌతేలా ఓ చిరుతో కలసి స్టెప్పులేసిన విషయం తెలిసిందే. మంగళవారం ప్రెస్ మీట్‌కి ఆమె కూడా వచ్చింది. చిరంజీవి షార్ట్‌గా అంటే 15 నిమిషాల్లో ముగించిన తన స్పీచ్‌లో ఆమె గురించి కూడా చెప్పాడు. ‘బాస్ పార్టీలో ఫుల్ జోషల్‌తో ఊర్వశి డ్యాన్స్ చేసిందని మెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఆమె కాస్త దగ్గరకు రావడంతో షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అక్కడే మొదలైంది అసలు కామెడీ.
చిరంజీవి మాస్ నటుడు ఎంత పాళ్లలో ఉన్నాడో, కామెడీ కూడా అంతే ఉంది. ఆ కమెడియన్ విత్ లవ్ ఆ క్షణంలో బయటకొచ్చాడు. ఈ క్రమంలో ‘అన్నయ్య’ సినిమాలో సౌందర్యతో చిరంజీవి చేసిన సీన్ కచ్చితంగా గుర్తొస్తుంది. సౌందర్య చేతి వేళ్లు తాకితే మెలికలు తిరిగిపోయే చిరు సీన్ గుర్తుందా? దాన్నే ఇక్కడా చేశాడు చిరు. ఊర్వశి చేయి తగలగానే మెలికలు తిరిగిపోయాడు చిరు. ఈ క్రమంలో గొంతారిపోయింది అని చెప్పేలా తాగడానికి నీళ్లు అడిగాడు.
మళ్లీ ఆమె చేతిని పట్టుకుని.. మెలికలు తిరిపోయి.. నవ్వులు పూయించాడు చిరు. ఇంతలో పక్కనే ఉన్న రాజేంద్రప్రసాద్ వచ్చి ‘నీళ్లు అడిగావు కదా’ అంటే.. వద్దులే అంటూ తన ప్రసంగం కొనసాగించాడు. వింటేజ్ చిరును సినిమాలో చూపిస్తాం అని దర్శకుడు బాబీ అంటున్నారు కానీ.. చిరంజీవి ప్రెస్ మీట్లోనే చూపించాడు. ఇక సినిమాలో ఏం చూపించాడు అనేది చూడాలి.
18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!
ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?