Chiranjeevi: చిరు నాలుగు దశాబ్దాల కృషికి కేంద్రం పురస్కారం..!

చలన చిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించిన వారికి కేంద్ర ప్రభుత్వం ఏటా పురస్కారాలు ఇస్తూ వస్తోంది. ఇండియన్‌ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ అంటూ ఇస్తున్న ఆ పురస్కారం ఈ ఏడాది ప్రముఖ నటుడు, మెగాస్టార్‌ చిరంజీవికి దక్కింది. ఈ మేరకు ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా వేదికగా ఈ పురస్కారాన్ని ప్రకటించారు. 2022కి గాను చిరంజీవి ఈ పురస్కారం దక్కించుకున్నారని కేంద్ర మంత్రి వెల్లడించారు.

ఆదివారం అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివ్‌ ఆఫ్‌ ఇండియా గోవాలో ఘనంగా మొదలైన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం 2013 నుండి ఈ అవార్డును సినీ ప్రముఖులకు అందిస్తోంది. పురస్కార రజత నెమలి పతకం, రూ.10 లక్షలు, ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. ఇక ఇప్పటివరకూ ఈ అవార్డును వహీదా రెహమాన్‌, రజనీకాంత్‌, ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, అమితాబ్‌ బచ్చన్‌, సలీమ్‌ ఖాన్‌, బిశ్వజిత్ ఛటర్జీ, హేమ మాలిని, ప్రసూన్‌ జోషి అందుకున్నారు.

టాలీవుడ్‌ నటుల నుండి ఈ జాబితాలో చేరిన తొలి వ్యక్తి చిరంజీవి కావడం గమనార్హం. చిరంజీవికి ఈ అవార్డు రావడంపై సోదరుడు పవన్‌ కల్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు. ‘‘తెలుగు చలన చిత్రసీమలో శిఖర సమానులు, అన్నయ్య చిరంజీవిని ‘ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ 2022’ పురస్కారం వరించడం సంతోషాన్ని కలిగించింది. ఈ పురస్కారం అన్నయ్య కీర్తి కిరీటంలో చేరిన మరోక వజ్రం. ఈ ఆనంద సమయంలో నా మార్గదర్శి అన్నయ్య చిరంజీవికి హృదయపూర్వక అభినందనలు.

అన్నయ్య సినీ ప్రస్థానం, తనను తాను మలచుకొని ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవడం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మరోవైపు చిరంజీవి కేంద్ర ప్రభుత్వానికి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. నాకు ఈ పురస్కారం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. అభిమానుల ప్రేమతోనే ఈ స్థాయికి చేరుకున్నా.. అందరికీ ధన్యవాదాలు అంటూ చిరంజీవి ట్వీట్‌ చేశారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus