Chiranjeevi: ‘అల్లుడా మజాకా’ కి 30 ఏళ్ళు.. ఆ టైంలో అంత జరిగిందా?

అదేంటి.. బ్లాక్ బస్టర్ సినిమా చిరుని డిజప్పాయింట్ చేయడం ఏంటి? అని అనుకుంటున్నారా? నిజమే..! బ్లాక్ బస్టర్ సినిమా చిరుని డిజప్పాయింట్ చేసింది. అలా అని ఎవరిదో సినిమా హిట్ అయితే చిరు (Chiranjeevi).. కడుపుమంటతో హర్ట్ అయ్యారు అని కాదు..! టాలీవుడ్లో ఏ చిన్న సినిమా హిట్ అయినా, పోటీ హీరో సినిమా హిట్ అయినా ముందుగా అప్రిషియేట్ చేసేది చిరునే..! కానీ ఇక్కడ ఆయన బ్లాక్ బస్టర్ సినిమా వల్లే ఆయన హర్ట్ అయ్యారు? ‘అలా ఎందుకు?’ అనుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలియాలంటే మనం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి?

Chiranjeevi

1995 ఫిబ్రవరి 25న .. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఈవీవీ సత్యనారాయణ (E. V. V. Satyanarayana) దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల్లుడా మజాకా’ సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. కానీ చాలా మంది మహిళలు, మహిళా సంఘాల వారు ఈ సినిమాపై విమర్శల వర్షం కురిపించారు. ఎందుకంటే ‘అల్లుడా మజాకా’ లో డబుల్ మీనింగ్ డైలాగులు, ఎక్స్పోజింగ్ వంటివి శృతిమించింది అనేది వారి వాదన. ఆ రోజుల్లో అల్లుడు అత్తారింటికి వెళ్తే.. కనీసం 10 అడుగుల దూరంలో అత్తగారు నిలబడేది.

అలాంటిది ‘అత్త’ని చాలా తక్కువ చేస్తూ నీచమైన సన్నివేశాలు ఉన్నాయి అని మహిళా సంఘాల వారు గోల పెట్టేశారు. ఒక సీన్లో అయితే అత్తగారితో పాటు ఆమె ఇద్దరి కూతుర్లపై కూడా అత్యాచారం చేసినట్లు సీన్ ఉంటుంది. దీనికి అయితే మహిళా సంఘాలు గోల పెట్టేశాయి అని చెప్పాలి. విషయం తెలుసుకుని చిరు బాగా హర్ట్ అయ్యారట. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే పోసాని కృష్ణమురళి అందించారు.

చిరు ఇప్పటికీ పోసానిని పీహెచ్ డి అని పిలుస్తుంటారట. ‘అల్లుడా మజాకా’ రిలీజ్ తర్వాత పోసానిని ఇంటికి పిలిచి రెస్పాన్స్ ఎలా ఉంది అని అడిగారట. మొదట్లో పలు సీన్లకి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ తర్వాత బి,సి సెంటర్ ఆడియన్స్ ఆ సీన్స్ కి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అయినా చిరు.. మాత్రం ‘అల్లుడా మజాకా’ రిజల్ట్ విషయంలో చాలా కాలం ఫీలయ్యారట. నేటితో ఆ సినిమా రిలీజ్ అయ్యి 30 ఏళ్ళు పూర్తి కావస్తోంది.

అజ్ఞాతంలో ఉంటూ వచ్చిన పోసానిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus