Chiranjeevi: సంక్రాంతి తప్ప చిరుకి మరో సీజన్ కలిసి రావడం లేదా..!

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి 6 ఏళ్ళు పూర్తికావస్తోంది. ఆయన రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150 ‘ 2017 సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించి రికార్డులు సృష్టించింది. బాహుబలి తర్వాత రూ.100 షేర్ మార్క్ ను టచ్ చేసిన సినిమా ఇదే. దీంతో 10 ఏళ్ళు సినిమాలకు దూరంగా ఉన్నా.. సినీ పరిశ్రమలో చిరు స్థానం అలాగే ఉంది అని అంతా భావించారు.

ఆ తర్వాత చిరు ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటించారు. 2019 వ సంవత్సరం గాంధీ జయంతి రోజున దసరా కానుకగా కూడా ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి కూడా సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా భారీగానే నమోదయ్యాయి. కానీ ఫుల్ రన్లో ఈ మూవీ నష్టాలనే మిగిల్చింది. కారణం ఈ సినిమాలో చిరు మార్క్ ఎలిమెంట్స్ లేకపోవడం. ‘సైరా నరసింహారెడ్డి’ మిగిల్చిన నష్టాలను ‘ఆచార్య’ తో తీరుద్దామని చిరు కొరటాలతో సినిమా ఫైనల్ చేశారు.

అయితే తర్వాత కోవిడ్ రావడం వల్ల ఈ సినిమాకి గ్యాప్ వచ్చింది. మూడేళ్ళ తర్వాత ఈ మూవీ 2022 సమ్మర్ కానుకగా ఈ మూవీ రిలీజ్ అయ్యింది. అయితే మొదటి షోతోనే ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. టాక్ పరంగా ఓపెనింగ్స్ పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ చూపని మూవీ ఇది. రాంచరణ్ వంటి ప్రజెంట్ స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ కొరటాల ఇమేజ్.. ఈ చిత్రాన్ని భారీ డిజాస్టర్ నుండీ కాపాడలేకపోయాయి. ఈ క్రమంలో చిరు ‘గాడ్ ఫాదర్’ చిత్రం చేశారు.

ఈ సినిమాకి తొలి షో నుండే పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద ఇంపాక్ట్ చూపించలేదు. ఈ మూవీ కూడా దసరా కానుకగా రిలీజ్ అయ్యింది. అయితే ఇటీవల సంక్రాంతి కానుకగా వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. రీ ఎంట్రీ ఇచ్చిన 6 ఏళ్లకు గాని చిరు ఇంకో హిట్ కొట్టలేకపోయారు. దీంతో చిరుకి సంక్రాంతి సీజన్ మాత్రమే కలిసొస్తుంది అనే కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సమ్మర్ కు రాబోయే ‘భోళా శంకర్’ ఫలితాన్ని బట్టి ఈ సెంటిమెంట్ నిజమో కాదో ప్రూవ్ అవుతుంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus