టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మెగాస్టార్ చిరంజీవికి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భోళా శంకర్ ఫ్లాపైనా చిరంజీవి తర్వాత సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. చిరంజీవి వశిష్ట కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుకానుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారని సమాచారం. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
చిరంజీవి తను సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేయడానికి ఆసక్తి చూపిస్తారనే సంగతి తెలిసిందే. పేద రోగుల కోసం చిరంజీవి తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉస్మానియా ఆస్పత్రి, గాంధీ ఆస్పత్రి, నీలోఫర్ ఆస్పత్రి, వరంగల్, మహబూబ్ నగర్ లోని ఆస్పత్రులకు వేర్వేరుగా 100 యూనిట్ల చొప్పున రక్తాన్ని ఉచితంగా పంపించారు. సకాలంలో బ్లడ్ అందక ఎవరూ మృతి చెందకూడదనే సదాశయంతో చిరంజీవి అత్యవసర సమయాల్లో లక్షల యూనిట్ల రక్తాన్ని ఆస్పత్రిలో ఉన్న పేదలకు అందేలా చేసి మంచి మనస్సును చాటుకున్నారు.
తనను కలిసిన అభిమానులకు సైతం ఏదైనా కష్టం వస్తే చిరంజీవి అస్సలు తట్టుకోలేరని తెలుస్తోంది. ప్రతిరోజూ చిరంజీవి లక్షల రూపాయలు దానం చేస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. చిరంజీవి వయస్సు ప్రస్తుతం 68 సంవత్సరాలు కాగా చిరంజీవి ఎనర్జీ లెవెల్స్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పవచ్చు. సరైన కథలను, టాలెంట్ ఉన్న డైరెక్టర్లను ఎంచుకుంటే మరికొన్ని సంవత్సరాల పాటు మెగాస్టార్ చిరంజీవికి తిరుగుండదని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
సినిమా సినిమాకు చిరంజీవి (Chiranjeevi) రేంజ్ అంతకంతకూ పెరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 2024 సంవత్సరంలో చిరంజీవి రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. ఒక్కో సినిమాకు 50 నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్న చిరంజీవి కథ నచ్చితే రిస్కీ సీన్లలో నటించడానికి కూడా ఆసక్తి చూపుతున్నారు. చిరంజీవికి భారీ విజయాలు దక్కాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. చిరంజీవిని అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!