ప్రభాస్ ని కలిసిన మెగాస్టార్ చిరంజీవి
- October 22, 2016 / 05:34 AM ISTByFilmy Focus
మెగాస్టార్ చిరంజీవి తన 150 వ సినిమా ఖైదీ నంబర్ 150 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన జైలు సెట్ లో డైరక్టర్ వి.వి.వినాయక్ చిరు పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ లో ఈరోజు (అక్టోబర్ 21) కొంత విశ్రాంతి దొరకడంతో ఖైదీ మహిస్మతి రాజ్యంలోకి వెళ్లారు. అదేనండీ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన బాహుబలి సెట్ లోకి చిరంజీవి వెళ్లారు.
పాట చిత్రీకరణలో నిమగ్నమైన ప్రభాస్ మెగాస్టార్ ని చూసిన వెంటనే షూటింగ్ బ్రేక్ చెప్పి, డ్రస్ చేంజ్ చేసుకొని వచ్చి ఆయన్ను కలిశారు. వీరిద్దరూ కాసేపు సినిమాల గురించి మాట్లాడుకున్నారు. అక్కడే ఉన్న దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కూడా వీరితో జాయిన్ అయ్యారు. ముగ్గురు ఉన్న ఫోటోని ఖైదీ నంబర్ 150 పీఆర్ఓ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇందులో చిరు ఖైదీ డ్రస్సులో కనిపిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది.
#KhaidiNo150 with the people of Mahishmathi! pic.twitter.com/TlF7dTcFOH
— #KhaidiNo150 (@KonidelaPro) October 21, 2016

















