Chiranjeevi: నాటకాలు వేయడం కోసం అప్పట్లోనే లంచమిచ్చారా.. అసలు విషయం చెప్పిన మెగాస్టార్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి చిరంజీవి తాజాగా తన మామయ్య అల్లు రామలింగయ్య గారి శత జయంతి వేడుకలలో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు రామలింగయ్య జీవితం గురించి రాసిన ఓ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. అలాగే అల్లు రామలింగయ్య గురించి ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఎన్నో విషయాలను తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రామలింగయ్య గారి గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు.

అయితే ఈయనకు నాటకాలలో వేయాలని ఎంతో పిచ్చి ఉండేదట.అలా నాటకాలు వేస్తూ సినిమా రంగంలోకి అడుగు పెట్టారని ఇలా సినిమా రంగంలోకి వచ్చినటువంటి ఈయన ఎంతోమందికి ఒక దారి చూపించారని వెల్లడించారు. ఇకపోతే అల్లు రామలింగయ్య గురించి మరొక విషయాన్ని కూడా వెల్లడించారు. ప్రస్తుత కాలంలో మనకు సినిమా అవకాశాలు రావాలన్న లేదంటే హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత మరిన్ని అవకాశాలు సంపాదించుకోవాలన్న

మేనేజర్లకు కొంత మొత్తంలో డబ్బు చెల్లించడం అలాగే రెమ్యూనరేషన్ లో పర్సంటేజ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే అప్పట్లోనే అల్లు రామలింగయ్య కూడా నాటకాలలో అవకాశాలు కల్పించాలని మేనేజర్లకు లంచాలు కూడా ఇచ్చేవారని తెలియజేశారు. అందరిలాగా రామలింగయ్య అవకాశాల కోసం మేనేజర్లకు డబ్బులు ఇవ్వకుండా బస్తాలు బస్తాలు బియ్యం లంచంగా ఇచ్చేవారట.

ఇలా బియ్యాన్ని లంచం గా ఇచ్చిన ఈయన చివరికి ఇండస్ట్రీలో నటుడిగా అవకాశాలను అందుకున్నారు. అయితే ఈయన కేవలం నటుడిగా మాత్రమే కాకుండా ఒక ఆర్ఎంపీ డాక్టర్ గా కూడా తన ప్రాక్టీస్ మొదలుపెట్టి ఇండస్ట్రీలో ఎంతోమందికి తన మందులు ఇచ్చారని చిరంజీవి వెల్లడించారు.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus