Chiranjeevi, Anasuya: అనసూయ అలిగిందా.. అసలు విషయం చెప్పిన చిరంజీవి!

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగం చేశారు. ఈ సినిమా మరికొన్ని గంటలలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈయన ప్రెస్ మీట్ నిర్వహించి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఎన్నో విషయాలను వెల్లడించారు.ఇక ఈ సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్లను ప్రతి ఒక్క ఆర్టిస్టులను ఈయన పేరుపేరునా గుర్తుచేసుకొని ఈ సినిమా గురించి ఈ సినిమా కోసం వారు ఎంత కష్టపడ్డారనే విషయాన్ని తెలియజేశారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి మెగాస్టార్ మాట్లాడుతూ ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉందని ఈ సినిమా చేయమని స్వయంగా చరణ్ తనకు సజెషన్ చేశారంటూ మెగాస్టార్ వెల్లడించారు.ఈ సినిమా చూస్తున్నంత సేపు ఏంటి ఇలా ఉంది అని నీరసం ఏ ఒక్కరిలోనూ కనిపించదని ప్రతి ఒక్కరికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది అంటూ ఈయన ధీమా వ్యక్తం చేశారు. ఇకపోతే అనంతపురంలో జరిగిన ప్రీ రిలీజ్ కార్యక్రమంలో భాగంగా ఈయన పలువురు చిత్ర బృందం పేర్లను ప్రస్తావించి

వారికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.అయితే ఇలా వేడుకలలో అందరి పేర్లు చెప్పడం సాధ్యం కాదు అనే విషయం మనకు తెలిసింది ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం సినిమాలో నటించిన కొందరి పేర్లను చెప్పడం మర్చిపోయారు. ఇంటికి వచ్చిన అనంతరం మర్చిపోయిన వారందరికీ ప్రత్యేకంగా ఫోన్లు చేసి ట్వీట్లు చేసి ఈయన పలకరించారని ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో తెలిపారు.

అలాగే ఫ్రీ రిలీజ్ వేడుకలు అనసూయ తన పేరును ప్రస్తావించలేదని ఆ అమ్మాయి తనపై అలిగింది అంటూ ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆచార్య సినిమా తర్వాత మెగాస్టార్ నటించిన సినిమా విడుదల కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus