Chiranjeevi: ఆ సమయంలో చిరంజీవి ఎంతో బాధ పడ్డాడట.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి (Chirajeevi) ప్రత్యేక గుర్తింపు ఉంది. చిరంజీవి సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా అదే సమయంలో భారీ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తున్నాయి. సీనియర్ హీరోలలో నంబర్ వన్ హీరో ఎవరనే ప్రశ్నకు చిరంజీవి పేరు సమాధానంగా వినిపిస్తుంది. చిరంజీవి బాక్సాఫీస్ వద్ద సాధించిన రికార్డులు అన్నీఇన్నీ కావు. అయితే బాబు మోహన్ (Babu Mohan) చిరంజీవి గొప్పదనం గురించి ఒక సందర్భంలో వెల్లడించారు. (Muta Mestri) ముఠామేస్త్రి సినిమాలో ఒక సీన్ కోసం చిరంజీవిని మూడు నెలల పాటు వెయిట్ చేయించానని బాబు మోహన్ తెలిపారు.

ఆ సమయంలో నేను కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు. నా వల్ల షూట్ ఆలస్యమవుతుండటంతో చిరంజీవి కోప్పడ్డారని బాబు మోహన్ కామెంట్లు చేశారు. ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు టైమ్ ఇచ్చానని నేను వెళ్లే సమయానికే చిరంజీవి వచ్చారని బాబు మోహన్ పేర్కొన్నారు. నేను సరిగ్గా నిద్ర లేకుండా షూట్ కు రావడం మెగాస్టార్ ను బాధ పెట్టిందని ఆయన అన్నారు.

ఆ సమయంలో చిరంజీవి నాకోసం ఇంటినుంచి దోసెలు తెప్పించారని బాబు మోహన్ వెల్లడించారు. చిరంజీవికి కూడా దోసెలు తినాలని ఉన్నా హీరో కావడం వల్ల డైట్ రూల్స్ వల్ల తినలేనని బాధ పడ్డాడని బాబు మోహన్ చెప్పుకొచ్చారు. బాబు మోహన్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిరంజీవి (Chiranjeevi) అంటే ఎంతో ఇష్టమని బాబు మోహన్ కామెంట్లు చేశారు.

బాబు మోహన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. కొన్నిరోజుల క్రితం బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. చిరంజీవి కెరీర్ విషయానికి వస్తే వరుస సినిమాలతో బిజీగా ఉన్న మెగాస్టార్ ఈ సినిమాలతో భారీ విజయాలను అందుకుంటాననే నమ్మకంతో ఉన్నారు. విశ్వంభరతో మెగాస్టార్ ఏ రేంజ్ హిట్ సాధిస్తారో చూడాలి.

గామి సినిమా రివ్యూ & రేటింగ్!

భీమా సినిమా రివ్యూ & రేటింగ్!
వళరి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus