టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన లైగర్ సినిమా ఈ నెలలోనే థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా విడుదలైన తర్వాత పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ హీరోగా జనగణమన పేరుతో మరో సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు మెగా హీరోలతో సినిమాలను తెరకెక్కించిన పూరీ జగన్నాథ్ చిరంజీవితో కూడా ఒక సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నారు.
గతంలోనే పూరీ జగన్నాథ్ చిరంజీవికి ఆటో జానీ కథ చెప్పగా ఫస్టాఫ్ నచ్చినా సెకండాఫ్ నచ్చకపోవడంతో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ అయితే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఆగిపోయిన మూవీకి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. మెగా ఫ్యాన్స్ కూడా చిరంజీవి పూరీ జగన్నాథ్ కాంబోలో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య కాలంలో పూరీ జగన్నాథ్ చిరంజీవిని తరచూ కలుస్తున్నారని బోగట్టా.
లైగర్ సినిమాతో సక్సెస్ సాధిస్తే చిరంజీవి పూరీ జగన్నాథ్ కాంబోను తెరపై చూడటానికి ఎంతో సమయం పట్టదని చెప్పవచ్చు. ఈ కాంబినేషన్ దిశగా అడుగులు పడతాయో లేదో చూడాల్సి ఉంది. పూరీ జగన్నాథ్ గత సినిమా ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. లైగర్ కూడా ఘన విజయాన్ని సొంతం చేసుకుంటే పూరీ జగన్నాథ్ కు ఛాన్స్ ఇవ్వడానికి స్టార్ హీరోలు సైతం సిద్ధంగా ఉంటారని చెప్పవచ్చు.
పూరీ జగన్నాథ్ తన డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలను పరిమిత బడ్జెట్ తోనే తెరకెక్కిస్తూ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. పలు సినిమాలకు పూరీ జగన్నాథ్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాసినిమాకు పూరీ జగన్నాథ్ కు క్రేజ్ పెరుగుతోంది.
Most Recommended Video
అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?