Chiranjeevi: వేదికపై మరో చర్చ లేవనెత్తిన చిరంజీవి

  • November 17, 2021 / 12:02 PM IST

సినిమా వాళ్లు చప్పట్లకు మురిసిపోతారు, అవార్డులకు ఆనందపడిపోతారు, ప్రశంసలకు పండగ చేసుకుంటారు. అందుకే అవార్డు ఫంక్షన్లు అంటే వారికి అంత ఇష్టం. తమ నటనకు వాటిని కొలమానంగా చూడరు కానీ… వాళ్ల కష్టాన్ని మరపించేవి మాత్రం అవే. ముఖ్యంగా అవార్డులు.. అందుకే కేంద్రం ఏటా సినిమాలను, సినిమా వాళ్లను పురస్కారంతో గౌరవిస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాలు మాత్రం ఈ విషయాన్ని పక్కనపెట్టేశాయి. ఈ మాట మేం అనడం లేదు. ఇటీవల ఓ ప్రైవేటు అవార్డుల ఫంక్షన్‌లో మెగాస్టార్‌ చిరంజీవి అన్న మాటలివీ.

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పూర్తిగా అవార్డుల సంగతి మరచిపోయాయి అంటూ కామెంట్‌ చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ విడిపోయిన తర్వాత రెండు ప్రభుత్వాలూ సినిమా కళాకారులకు అవార్డుల ఇచ్చే సంగతిని మరిచిపోయాయి. రెండు రాష్ట్రాలూ ఆలోచించి అవార్డుల్ని ప్రకటించి వేడుకల్ని నిర్వహిస్తే బాగుంటుంది’’ అంటూ చిరంజీవి కామెంట్‌ చేశారు. పురస్కార వేడుకకి ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి ఎప్పటిలాగే సినీ పరిశ్రమకి సంబంధించిన వివిధ అంశాలపై మాట్లాడారు. కళాకారులకి అవార్డులు ఉత్సాహాన్నిస్తాయి. ప్రభుత్వాలు సినిమా కళాకారులకి అవార్డులు అందించి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అన్నారు.

అయితే అదే కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ… మా ప్రభుత్వం చిత్ర పరిశ్రమను ప్రోత్సహించే విషయంలో ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. దీంతో చిరంజీవి టాలీవుడ్‌లో మరో చర్చను లేవనెత్తారు. ఇండస్ట్రీ సమస్యలు ఎంత ముఖ్యమో, నటులకు ప్రశంసలు, పురస్కారలు అంతే ముఖ్యం. గతంలోనూ చాలామంది పెద్దలు ఇదే మాట చెప్పారు. మరిప్పుడు చిరంజీవి లేవనెత్తిన అంశానికి టాలీవుడ్‌ పెద్దలు నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus