కొండా సురేఖ సమంత వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ విషయంలో ఘాటుగా స్పందించగా ఆ జాబితాలో చిరంజీవి (Chiranjeevi) సైతం చేరారు. గౌరవనీయులైన మంత్రి కొండా సురేఖ చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధ పడ్డానని చిరంజీవి అన్నారు.
Chiranjeevi
త్వరితగతిన వార్తల్లో నిలవడానికి సెలబ్రిటీలు, సినీ కుటుంబాలకు చెందిన వాళ్లను సాఫ్ట్ టార్గెట్ చేయడం సిగ్గుచేటని చిరంజీవి తెలిపారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన సభ్యులపై ఇలాంటి మాటల దాడులను మేమంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నామని చిరంజీవి పేర్కొన్నారు. పాలిటిక్స్ తో సంబంధం లేని వ్యక్తులు, మరీ ముఖ్యంగా మహిళలపై ఇలాంటి ఆరోపణలు చేసి దిగజారవద్దని చిరంజీవి కామెంట్లు చేశారు.
మేము మా నాయకులను సమాజాభివృద్ధి కోసం ఎన్నుకుంటామని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా వారు తమ స్థాయిని తగ్గించుకోకూడదని చిరంజీవి పేర్కొన్నారు. రాజకీయ నాయకులు, గౌరవప్రదమైన స్థానాలలో ఉన్నవారు ఎంతోమందికి స్పూర్తిగా నిలవాలని చిరంజీవి చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ (Allu Arjun) , మంచు లక్ష్మి (Manchu Lakshmi) , సుధీర్ బాబు (Sudheer Babu), నిర్మాత ఎస్కేఎన్ Sreenivasa Kumar Naidu(SKN), రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma), స్వప్నాదత్ (Swapna Dutt) సైతం మంత్రి కామెంట్లపై ఫైర్ అయ్యారు.
మంత్రి కొండా సురేఖ ఇప్పటికే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించినా సెలబ్రిటీలు మాత్రం తీవ్రస్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకూడదనే ఆలోచనతో సెలబ్రిటీలు ఇంత ఘాటుగా స్పందిస్తున్నారని తెలుస్తోంది. కొండా సురేఖ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంపై సమంత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సమంతపై వచ్చిన నిరాధార ఆరోపణల విషయంలో ఆమె అభిమానులు ఫైర్ అవుతున్నారు. స్వయంకృషితో ఎదిగిన స్టార్ హీరోయిన్ గురించి నిరాధార అరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.